Rajinikanth Vetteyian Movie Full review
MOVIE REVIEWS

‘వేట్టయాన్’ మూవీ రివ్యూ

Rajinikanth Vetteyian Movie Full review
Rajinikanth Vetteyian Movie Full review

Rajinikanth Vetteyian Movie Full review : టీజీ జ్ఞానవేల్ … తమిళ ఇండస్ట్రీ లో ‘జై భీమ్’తో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు. ఆయన దర్శకత్వం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, రానా దగ్గుబాటి ఫహద్ ముఖ్య పాత్రల్లో రూపొందించిన చిత్రం వేట్టయాన్….

ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం పదండి.

తారాగణం: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ ,రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్, రావు రమేష్, కిషోర్, అభిరామి తదితరులు

సంగీతం: అనిరుధ్ రవిచందర్
కెమెరా: ఎస్.ఆర్.కదిర్
నిర్మాత: సుభాస్కరన్
రచన- టీజీ జ్ఞానవేల్-కృత్తిక
దర్శకత్వం: టీజీ జ్ఞానవేల్

గత ఏడాది నెల్సన్ దర్శకత్వం లో ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టామినా ప్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ తర్వాత ఆయన కూతురు దర్శకత్వం లో ప్రత్యేక పాత్రలో నటించిన ‘లాల్ సలాం’ నిరాశపరిచింది. తదుపరి చిత్రం గా చేసిన మూవీ ‘వేట్టయాన్’.

కథ:
తమిళనాడులోని కన్యాకుమారిలో ఎస్పీగా పని చేస్తుంటాడు అథియన్ (రజినీకాంత్), ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా దేశంలోనే గొప్ప పేరుంటుంది అథియన్ కు. సమాజానికి హానికరమైన నేరస్థులను తనదైన శైలిలో ఏరి పారేస్తుంటాడు. చట్టం కంటే తనని తాను నమ్మే అథియన్ కు తాను చేసే ఎన్ కౌంటర్ల విషయంలో పశ్చాత్తాపం ఏమీ ఉండదు.

అథియన్ చేసిన ఒక స్మగ్లర్ ఎన్ కౌంటర్ కు శరణ్య అనే
ఉపాధ్యాయురాలు సహకరిస్తుంది. తర్వాత కొన్ని రోజులకే ఆ ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురవుతుంది. ఆమెను చంపింది గుణ అనే వ్యక్తి అని తెలుసుకొని తగిన ఆధారాలను సేకరించి అతణ్ని ఎన్ కౌంటర్ చేస్తాడు అథియన్.

కానీ ఈ ఎన్ కౌంటర్ ని విచారించిన జడ్జి సత్యదేవ్ (అమితాబ్) ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి కొన్ని సంచలన విషయాలు బయటికి తీసి అథియన్ ముందు పెడతాడు. వాటిని తెలుసుకున్నాక తొలిసారి పశ్చాత్తాప పడే పరిస్థితి వస్తుంది..

ఇంతకీ సత్యదేవ్ వెలుగులోకి తెచ్చిన విషయాలేంటి.. దాని వల్ల అథియన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.. చివరికి ఈ కేసు సంగతి ఏమైంది.. ఈ విషయాలన్నీ తెర మీదే చూడాలి.

Read Also : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

కథనం-విశ్లేషణ:

కథ మీద నడిచే సినిమాలు కొన్ని ఉంటాయి
స్టార్లు మాత్రమే నడిపించగల కథలు కొన్ని ఉంటాయి.
స్టార్లు మాత్రమే చేయాల్సిన కథలూ కొన్ని ఉంటాయి.
ఇవన్నీ కాకుండా స్టార్లు ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి మామూలు కథల్లోనూ నటిస్తే వాటి రీచ్ ఎంత గా పెరుగుతుందో గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం l.

టీజీ జ్ఞానవేల్…. సూర్య లాంటి స్టార్ హీరో తో తన ఇమేజ్ ని పక్కన పెట్టించి మరి ‘జై భీమ్’ అనే ఓ గొప్ప కథలో నటింప చేసాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రీచ్ సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే .

ఆ ప్రయోగం బ్లాక్ బస్టర్ అవ్వడం తో తర్వాత సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తోను అదే సామాజిక అంశాలతో ముడిపడ్డ ఓ మంచి కథనే చెప్పడానికి ప్రయత్నించాడు జ్ఞానవేల్.

ఐతే రజినీ ఇమేజ్ వేరు…
సూర్య ఇమేజ్ వేరు….
ఎంత వద్దనుకున్నా బయటికి రాలేని ఇమేజ్ ఛట్రం రజినీది. అందుకే కమర్షియల్ హంగులు జోడించక తప్పలేదు.

అలా కొంచెం పక్కకి వెళ్లి జోడించిన కమర్షియల్ హంగులు సినిమాలో సింక్ అవ్వలేదని అనుకోలేము. అలా అని అవి అదిరే లాగ ఉన్నాయి అని చెప్పలేం.

ఇక కథ గురించి మాట్లాడుకుంటే దర్శకుడు తీసుకున్న పాయింట్ మంచిదే. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ నడిచే థ్రిల్లర్ సినిమాలా ఆసక్తికరంగా నడిచే ‘వేట్టయాన్’ ఆపై సామాజిక అంశాల వైపు నడిపించాడు.. మరల కాసేపాగాక సాగదీసి క్లాస్ లు చెప్పడం తో.. చివరికి మామూలు సినిమాలా ముగుస్తుంది.

ఓ పోలీస్ అధికారి తాను నమ్మిన న్యాయానికి కట్టుబడి ఎన్ కౌంటర్లు చేస్తాడు. అవన్నీ పేరు కోసం చేసినవి కాదు. వాటి విషయంలో గర్వపడడు, పశ్చాత్తాపం పడడు

ప్రతి ఎన్ కౌంటర్ విషయంలో తనకి తాను సమాధానం చెప్పుకున్నాకే నేరస్థుల పని పడతాడు. అలాంటి అధికారి ఒక నిర్దోషి ని అన్యాయంగా చంపేస్తే? ఇదే ‘వేట్టయాన్’ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ‘వేట్టయాన్’ ప్రేక్షకులకు మంచి ఊపునిస్తుంది. అక్కడి వరకు సినిమా చాలా రేసీ గా నడుస్తుంది. ఆ తర్వాత ఆ వేగం లేకపోవడమే ‘వేట్టయాన్’ సమస్య.

మొదటి సగం వరకు ‘వేట్టయాన్’ మంచి రేసీ గా నడుస్తుంది. కథ ఎలా ఉన్నా రజినీ సినిమా అంటే విపరీతమైన బిల్డప్పులు.. ఎలివేషన్లు షాట్లు మామూలే. ఈ కథలో అవి అంతగా అతకక పోయినా.. కథ ని చెడగొట్టకుండా అభిమానులని నిరాశ పరచకుండా అక్కడక్కడా ఎలివేషన్లు ఇస్తూ.. బలంగానే కథను చెప్పాడు జ్ఞానవేల్.

ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా హీరో పాత్ర పరిచయానికి, ఎలేవేషన్స్ కి ఒక ఎపిసోడ్ ని డిజైన్ చేసి.. ఆ తర్వాత వెంటనే కథలోకి వెళ్లిపోయాడు. శరణ్య పాత్రతో సినిమా ని ఒక ఇంటెన్స్ మోడ్ వైపు నడిపించాడు. ఏ అమ్మాయి సాయంతో అయితే హీరో ఓ స్మగ్లర్ ను ఎన్ కౌంటర్ చేసాడో.. కానీ చివరికి ఆ అమ్మాయే చనిపోవడం.. దాన్ని పోలీసులు ఛేదించి హంతకుడిని చంపడం.. ఆ ఎన్కౌంటర్ లో తప్పులు జరగడం.. ఇలా ‘వేట్టయాన్’ చాలా చక్కగా ప్రేక్షకులని రంజింప చేస్తుంది. ఇంటర్వెల్ సమయానికి కథ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటది.

ఐతే ద్వితీయార్ధంలో ట్విస్ట్స్ అన్ని వీడే వరకు ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేసే ‘వేట్టయాన్’ ఆ తర్వాత సాధారణంగా మారిపోతుంది. అసలు విలన్ ఎవరో తెలిసిన దగ్గర్నుంచి కథను అతి సాధారణంగా తీసుకెళ్లాడు దర్శకుడు.

అప్పటిదాకా థ్రిల్లర్ స్టయిల్లో నడిచిన ‘వేట్టయాన్’ ఆ తర్వాత ఓ సామాజిక సమస్య చుట్టూ అక్కడే తిరుగుతూ బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు తీసుకున్న సమస్య ముఖ్యమైందే అయినా.. ఈ ఫార్మాట్లో చాలా కథలు వచ్చేసి ఉండడం వళ్ళ ప్రేక్షకుడు డిస్కోనెక్ట అయిపోతాడు.

ఈ కథ రజినీ రేంజ్ కి చిన్నదిగా అనిపిస్తుంది. అమితాబ్ కూడా ఒక దశ దాటాక పెద్దగా చేసింది ఎం లేదు. మిగతా నటుల ప్రాధాన్యమూ తగ్గిపోయింది. సినిమా మొదలు పెట్టినప్పుడు నడిచిన తీరుకు.. చివరికి ముగిసిన తీరుకు పొంతన ఉండదు. జ్ఞానవేల్ కథలోని ఎమోషన్ ప్రేక్షకులను బలంగా తాకుతుంది. కానీ ‘వేట్టయాన్’ మాత్రం ఆ ఫీలింగ్ ఇవ్వదు.

దర్శకుడి చాలా మంచి ప్రయత్నం చేసాడు ఈసారి కూడా మంచి కథనే చెప్పాడు. సూపర్ స్టార్ ని కొత్తగా ప్రెజెంట్ చేశాడు. ప్రథమార్ధంలో చాలా విజిల్ మూమెంట్స్ ఇచ్చాడు. కానీ మొత్తం గా ఒక పకడ్బందీ సినిమాను ఇవ్వలేకపోయాడు. ఒకసారి చూడ్డానికి ఢోకా లేని.. ‘జస్ట్ ఓకే’ అనిపించే సినిమా ఇది.

Read Also : Pushpa 2: బిజినెస్ ఎంత చేస్తుంది.. హిందీ సంగతేంటి…

నటీనటులు:

సూపర్ స్టార్ ఇందులో ఎంతో కొత్తగా కనిపిస్తారు. ఆయన స్టయిల్లో ఎలివేషన్లు లేవు కానీ అభిమానులను అలరించే సీన్లు పడ్డాయి. చాలా వరకు కథతో పాటే రజిని ప్రయాణించారు.

రజిని కి ఉన్న స్టార్ పవర్ తో పాటు పెర్ఫామెన్స్ కూడా అలరిస్తుంది. ఇందులో కొన్ని మామూలు సీన్లలో కూడా సూపర్ స్టార్ ఆకర్షణీయంగా మార్చారు. అమితాబ్ జడ్జి పాత్రకు హుందాతనం తీసుకొచ్చారు.

సినిమాలో కీలక పాత్ర చేసిన దుషారా విజయన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఫాహద్ ఫాజిల్.. ఈ సినిమాలో వినోదం పంచే పాత్రలో నటించి పెర్ఫార్మన్స్ అదరగొట్టాడు. రజినీ ముందు
నెగెటివ్ పాత్రలో రానా దగ్గుబాటి ఆకట్టుకున్నాడు
రజిని కి దీటుగా నిలబడ్డాడు. రజినీ భార్య పాత్రలో మంజు వారియర్ మెప్పించింది.

సాంకేతిక వర్గం:

అనిరుధ్ రవిచందర్ సంగీతం ఇంకా బావుండాలి అనిపిస్తుంటది. బ్లాక్ బస్టర్ హిట్ ఐన మనసిలాయే పాట బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్, రజినీ ఎలివేషన్ సీన్లలో అనిరుధ్ ఎప్పట్లాగే డ్యూటీ చేశాడు. కదిర్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్ గా సినిమా చాలా బాగుంది.

లైకా నిర్మాణ విలువలూ బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ ప్రయత్నం మాత్రం మెచ్చదగిందే. రజినీని ఈ కథలోకి తీసుకురావడం తోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. ఆయన్ని కొత్తగా ప్రెజెంట్ చేసి కథకు రీచ్ ఇవ్వగలిగాడు.

చివరగా: వేట్టయాన్.. వేట ని మధ్యలో ఆపేసాడు….

Rajinikanth Vetteyian Movie review రేటింగ్ – 2.75/5

Follow us on Instagram

Related posts

‘జనక అయితే గనక’ రివ్యూ: కామెడీ కోర్ట్ రూమ్ కథ

filmybowl

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

Leave a Comment