Rajinikanth Veeteyian Trailer Review : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా వేట్టయన్ అక్టోబర్ 10 దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇవాళ సినిమా బృందం ట్రైలర్ రిలీజ్ చేశారు. సూర్యతో జై భీం లాంటి క్లాసిక్ మూవీ తీసి అందరి ప్రశంసలు అందుకున్న టీజె జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ , టాలీవుడ్ హంక్ రానా, మలయాళం సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్, మంజు వారియర్ లాంటి భారీ క్యాస్టింగ్ తో నిర్మించారు లైకా ప్రొడక్షన్స్ సంస్థ.
రజినీకాంత్ ఇండస్ట్రీ హిట్ జైలర్ తర్వాత వస్తున్న సినిమా కావడం తో తమిళంలో ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. తెలుగులోనూ మెల్లగా బజ్ పెరుగుతోంది.
తమిళం లో ఉన్న టైటిల్ ఏ తెలుగు లోను పెట్టడం కాస్త అసంతృప్తి గా ఉంది
ఇక ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే సినిమా కథ ప్రేక్షకులకి చెప్పేసాడు దర్శక నిర్మాతలు.
ఆడపిల్లని హత్య చేసి దానికి కారణమైన నిందితులు దొరక్కుండా తప్పించుకుంటా తిరుగుతుంటారు. ఎలాగైనా ఆ నిందితులని పట్టుకోవాలనే ఒత్తిడిలో ప్రభుత్వం పోలీస్ డిపార్ట్ మెంట్ ని ఇబ్బంది పెడుతుంటది. దొరికితే జైలు లో వేసి సపర్యలు చేయడం కాదు ఏకంగా ప్రాణాలే తీయాలని అలా చేస్తేనే నేరస్థుల్లో భయం పెరిగి నేరాలు తగ్గుతాయి అనేది వేట్టయన్ మాట దీంతో నేరస్థుల అంతు చూసేందుకు బరిలోకి దిగుతాడు వేట్టయన్.
అయితే వాడిని పట్టుకుంటే చాలనే నిబంధనలు, ప్రెస్సురెస్క,మిటీలు ఇలా ఎన్ని అడ్డంకులు వస్తున్నా సరే ఆ దుర్మార్గుడిని చంపి తీరాలని మొండిగా ముందుకు వెళ్తాడు. మధ్యలో వచ్చే అడ్డంకులు, ఊహించని పాత్రలు, మలుపులు ఇవన్నీ కలగలిపితే వేట్టయన్ సినిమా అని అర్ధం అవుతుంది.
ఇదంతా చూస్తుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశా కేసు గుర్తుకు వస్తుంది.
Read Also : దేవర డే 6 కలెక్షన్స్ – కుమ్మేసిన దేవరోడు
2019 హైదరాబాద్ లో ఒక డాక్టర్ ని జాతీయ రహదారిపై నుంచి ఎత్తుకుపోయి దారుణంగా అత్యాచారం చేసారు అంతటితో ఆగకుండా మృగాలని మించిన పైశాచికత్వం తో పెట్రోల్ పోసి అంతమొందించడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఇది జరిగిన చాలా కొద్ది రోజుల్లోనే నగర శివార్లలో ఆ దారుణానికి ఒడిగట్టిన నిందితులని పట్టుకుని ఎన్కౌంటర్ చేసేసారు. ఆ జరిగిన ఎన్కౌంటర్ ఎంతో సెన్సేషన్ అయింది ప్రజలు కూడా దీని స్వాగతించారు.
ఈ ఎన్కౌంటర్ కి నేతృత్వం వహించిన సజ్జనార్ ని జనం విపరీతం గా పొగిడారు. ఆ తర్వాత మానవ హక్కుల మాటలు ఇన్వెస్టిగేషన్ జరిగిందనుకోండి. ఇప్పుడు ఈ ఉదాంతాన్నే తీసుకొని వేట్టయన్ లో చూపిస్తున్నట్టు గా అర్ధం అవుతుంది.
Follow us on Instagram