MOVIE NEWS

వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. వరుస ప్లాప్స్ తో వున్న నితిన్ కు వెంకీ కుడుముల “భీష్మ” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందించాడు.. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న “ రాబిన్ హుడ్ “ పై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సర్ ప్రైజింగ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే..

స్టేజ్ పై డాన్స్ అదరగొట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ సైతం హాజరు కావడం విశేషం. కాగా, డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ గా మారాయి.స్టేజ్ పైనే అందరి ముందే..రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ని తిట్టేశారు. రేయ్ వార్నర్ అంటూ సంబోధించారు.. అంతేకాదు క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే, రాజేంద్రప్రసాద్ సరదాగానే డేవిడ్ వార్నర్ పై ఇలాంటి కామెంట్స్ చేసారు..48 ఏళ్లుగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ అదే రేంజ్ లో రానించడానికి కారణం మైత్రీ మూవీస్..

ఇది నా సొంత నిర్మాణ సంస్థ లాంటిది. నవీన్, రవి వీళ్లంతా నా బిడ్డలు. నేను వీరి ప్రొడక్షన్ లో మొదట శ్రీమంతుడు సినిమాలో యాక్ట్ చేశా. ఇవాళ రాబిన్ హుడ్ లో నటించా. ఇవాళ మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అర్హత నాకు దక్కింది…రాబిన్ హుడ్ సినిమా హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్ లో కూర్చుని చూసే సినిమా. చాలాకాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగటానికి కారణం వెంకీ కుడుముల. ఈ క్రెడిట్ అంతా నేను తనకిస్తాను. మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ సినిమా ప్రేక్షకులకు సూపర్ ఫన్ ఇస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు..

 

Related posts

రాజమౌళి చెప్పిందే నిజమైంది.. ఇక నుంచి అసలైన బాక్సాఫీస్ వార్ షురూ..!!

murali

కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!!

murali

అల్లుఅర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు.. తడబడిన ఐకాన్ స్టార్..?

murali

Leave a Comment