పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అప్పట్లో ప్రకటించినా కానీ..చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్ లో కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం…
SSMB : మహేష్ స్టన్నింగ్ లుక్ మాములుగా లేదుగా..!!
ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయింది. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజి అప్డేట్ వైరల్ అవుతుంది..రాజాసాబ్ టీజర్ ను వచ్చే రెండు వారల్లోపు రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం… ఇప్పటికే టీజర్ ను దర్శకుడు మారుతీ పర్ఫెక్ట్ గా కట్ చేయించారని సమాచారం. ప్రభాస్ డబ్బింగ్ చెప్పడం ఒక్కటే పెండింగ్ లో వుంది..
ప్రభాస్ ప్రస్తుతం హాలిడే టూర్ లో గడుపుతున్నారు. వచ్చిన తర్వాత డబ్బింగ్ కంప్లీట్ చేయనున్నారట..ఎట్టి పరిస్థితుల్లో రెండు వారాల్లో టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది…ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్స్ రాక చాలా రోజులు అవుతోంది. ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన క్యూట్ బ్యూటీ మాళవిక మోహనన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు ఔట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇస్తున్నట్లు సమాచారం..