Uncategorized

రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రభాస్ గత ఏడాది వచ్చిన “సలార్” సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు “సలార్” సినిమా  భారీ ఊరటని ఇచ్చింది.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుంది.ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కల్కి 2898 AD “.. ప్రభాస్ కెరీర్ లోనే అల్టిమేట్ హిట్ అందుకుంది.ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ప్రభాస్ రేంజ్ ఏంటో నిరూపించింది.

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.వాటిలో “రాజా సాబ్” మూవీ ఒకటి.ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన మలయాళం బ్యూటీ మాళవిక మోహనన్,అలాగే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్రభాస్ ఇలాంటి జోనర్ లో నటించడం ఇదే మొదటిసారి..ఈ సినిమాను మారుతీ తన స్టైల్ ఆఫ్ కామెడీతో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో ప్రభాస్ మరో భారీ విజయం అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాంచరణ్..”గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్ ..!!

ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందని సమాచారం.ఈ సాంగ్ కోసం మేకర్స్ లేడీ అమితాబ్ నయనతారను దాదాపు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తుంది .త్వరలోనే మేకర్స్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.గతంలో వచ్చిన యోగి సినిమాలో ప్రభాస్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది.దాదాపు  17 ఏళ్ళ తరువాత మళ్ళి వీరి కాంబినేషన్ సెట్ కావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Related posts

సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!!

murali

Leave a Comment