పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో త్వరలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లిన దర్శకుడు మారుతి. రాజా సాబ్ మూవీ అప్డేట్ గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..
ఎన్టీఆర్-నీల్ : ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తున్న తారక్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిందిగా..!!
‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్‌తో చేస్తున్నాం. కొంత డబ్బింగ్ పార్ట్, సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు..సీజీ వర్క్స్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుందని తెలిపారు. ఔట్‌పుట్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంటుందని మారుతీ తెలిపారు… సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు… సినిమా అంటే అందరి శ్రమ, కష్టం ఆధారపడి ఉంటుంది.. ఏ ఒక్కరు నిర్ణయం తీసుకునేది కాదు.అందుకే అనుకున్న టైమ్‌కు సినిమా రిలీజ్ కాలేదు.. సీజీ వర్క్స్ కంప్లీట్ అయిన వెంటనే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుందని మారుతీ తెలిపారు..
దీనితో రాజాసాబ్ రిలీజ్ ఈ ఏడాది ఉండదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రభాస్ వింటేజ్ పెర్ఫార్మన్స్ చూడలనే డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా వాయిదా కాస్త నిరాశ కలిగించింది..అయితే ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.. హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది..