MOVIE NEWS

రాజాసాబ్ : రిలీజ్ పై లేని క్లారిటీ.. నిరాశలో ఫ్యాన్స్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో బిగ్గెస్ట్ హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.. కానీ తాజాగా ‘రాజా సాబ్’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ మూవీ టీం మాత్రం ఇప్పటివరకు వాయిదా విషయంపై స్పందించలేదు..ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!!

తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు షూట్ చేసిన భాగం మొత్తం మూడు గంటల 30 నిమిషాల ఫుటేజ్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇంకా ఈ సినిమాకు సంబంధించి మూడు పాటలు షూట్ చేయాల్సి ఉందట. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఆ సాంగ్స్ షూటింగ్ పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 3 గంటల 30 నిమిషాల సినిమా అదీ హారర్ జోనర్‌ కావడంతో మేకర్స్ రిస్క్ తీసుకోలేక సినిమాని ఎడిట్ చేసి నిడివి తగ్గించే పనిలో కూడా ఉన్నారని సమాచారం..ఈ సినిమాను మేకర్స్ జులై 24 న రిలీజ్ చేయనున్నట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది..

ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్ సినిమాతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో “ ఫౌజీ” అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది…ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో అంచనాలు వేరే లెవెల్ లో వున్నాయి..అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సలార్ 2 వంటి సినిమాలు వున్నాయి.. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

 

 

Related posts

ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్, యంగ్ టైగర్.. భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్..!!

murali

రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!!

murali

కన్నప్ప : ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెంచేసిన మంచు విష్ణు..!!

murali

Leave a Comment