MOVIE NEWS

రాజాసాబ్ : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..నెక్స్ట్ లెవెల్ టీజర్ లోడింగ్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.గతంలో వచ్చిన కల్కి’, ‘సలార్’ సినిమాలతో ప్రభాస్ తన కెరీర్ మరో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు..ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్’అనే బిగ్గెస్ట్ హారర్ కామెడీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

మొదటి సారి ప్రభాస్ ఇలాంటి జోనర్ లో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది ఈ సినిమాకి సంబంధించి 90 శాతం కి పైగా టాకీ పార్ట్ ని మేకర్స్ పూర్తి చేసారు..ఏప్రిల్ 10 న గ్రాండ్ గా విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం అవుతుండడంతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది.. ఈ ఏడాది చివర్లో ”రాజాసాబ్” విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం..కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌తో పాటు అదిరిపోయే టీజర్‌ను వచ్చే నెలలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

టీజర్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి అప్పటి నుంచే గ్రాండ్ ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..అయితే ఏప్రిల్ 10న రాజాసాబ్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది…సినిమా రిలీజ్ కాకపోవడంతో ఆ డేట్ న టీజర్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కూల్ అవుతారని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

Related posts

రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా ఇంపార్టెంట్ సమాచారాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్

filmybowl

బాలయ్య, ఎన్టీఆర్ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చిన నాగావంశీ..!!

murali

అకిరా నందన్ తో ఖుషి 2..ఎస్.జె సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment