MOVIE NEWS

మహేష్ కు రాజమౌళి సరికొత్త కండిషన్స్.. బాబు పాటిస్తాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్నాడు..ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కనుంది.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ సిద్ధం చేసారు.”ఎస్ఎస్ఎంబి “అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కే.ఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో  తెరకెక్కిస్తున్నారు.

మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!!

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం రాజమౌళి గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేసారు.ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించి భారీ లొకేషన్స్ కోసం వేట సాగిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు ఈ సినిమాకు సంబంధించి ముఖ్య విశేషాలు చెప్పబోతున్నారు.ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ తన లుక్ పూర్తిగా మార్చుకున్నారు.గుబురు గడ్డం ,లాంగ్ హెయిర్ తో మహేష్ లుక్ అదిరిపోయింది.అయితే తాజాగా మహేష్ గడ్డం ట్రిమ్ చేసుకొని కనిపించడంతో రాజమౌళి సినిమా హోల్డ్ లో పడిందా అని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా కోసం లుక్ టెస్టులు జరుగుతున్నట్లు సమాచారం.రాజమౌళి ఇంకా మహేష్ లుక్ కన్ఫామ్ చేయలేదు.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్న రాజమౌళి షూటింగ్ కండిషన్స్ అన్నీ మహేష్ కి వివరించినట్లు సమాచారం.అలాగే కొన్ని హార్డ్ సిట్యుయేషన్స్ లో కూడా షూటింగ్ జరుగుతుంది కనుక మహేష్ తన బాడీ ఫిట్నెస్ గురించి మరింత కేర్ తీసుకోవాలని రాజమౌళి వివరించినట్లు సమాచారం.ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు దానికి తగ్గట్టు సిద్ధంగా ఉండాలని మహేష్ కు రాజమౌళి సూచించినట్లు సమాచారం.

Related posts

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..?

murali

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

murali

వర , తంగం రిలేషన్ తేడాగే ఉందే

filmybowl

Leave a Comment