MOVIE NEWS

Rajamouli : దర్శక దిగ్గజానికి ఇష్టమైన సినిమా ఏమిటో తెలుసా..?

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన తీసిన చిత్రాలలో ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ అందుకోలేదు.. ఆయన తీసిన ప్రతీ సినిమాలో ప్రేక్షకులని ఆకట్టుకునే సన్నివేశాలు ఉండేట్లు జాగ్రత్త పడతాడు.. రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే.. తాను చేసే సినిమాలో ఏ హీరో అయిన గతంలో ఎన్నడూ చేయని విధంగా పాత్రని డిజైన్ చేస్తారు.. ఊహించని యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ అంశాలతో రాజమౌళి ప్రేక్షకులని మాయ చేస్తారు.. రాజమౌళి కెరీర్ లో బాహుబలి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది.. అయితే ఇంత ప్రభంజనం సృష్టించిన బాహుబలి ఫ్రాంచైజ్ చిత్రాలు కూడా తన కెరీర్‌లో బెస్ట్ చిత్రాలు కాదంటూ రాజమౌళి ఊహించని బాంబ్ పేల్చాడు..

ది రాజాసాబ్ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ సినిమా ‘జూనియర్’. ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు స్పందించిన రాజమౌళి, తన కెరీర్‌లో ఆయనకు అత్యంత ఇష్టమైన సినిమా ‘ఈగ’ అని చెప్పారు.

RRR షూటింగ్ సమయంలో ‘స్టూడెంట్ నెం.1’ లొకేషన్స్‌కు వెళ్లినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక పాత ఫోటోను రీ క్రియేట్ చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నాడు. “సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీయాలని అందరూ భావించారు. కానీ ‘సై’తో ఆ అంచనాలన్నీ బ్రేక్ చేసి, యూత్‌ఫుల్ సినిమాని తీసాం. నచ్చిన కథకు తగ్గట్టుగా సినిమాలు తీయొచ్చని అప్పుడు అర్థమైంది అని ఆయన తెలిపారు.

Related posts

ప్రభాస్ ‘రాజసాబ్’ టీజర్ రన్ టైం లాక్..!!

murali

ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

murali

రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న పవర్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!!

murali

Leave a Comment