Raana Daggubati in to villian role again
MOVIE NEWS

మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా?

Raana Daggubati in to villian role again
Raana Daggubati in to villian role again

Raana Daggubati : టాలీవుడ్ హ్యాండ్సం హంక్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. పర్సనాలిటీ ఏ కాకుండా పాత్ర ఎదైనా కుమ్మేసే నటుడు రానా.

సినిమాల్లో హీరో, విలన్ ఎదైనా
ఫంక్షన్స్ కి హోస్ట్ లేదా
ఎదైనా సినిమాకి పబ్లిసిటీ బాధ్యత ఏదీ ఇచ్చిన
అవ‌లీల‌గా సక్సెస్ అవ్వగల ఒకే ఒక్కడు రామానాయుడు దగ్గుబాటి అదేలెండి మీ రానా దగ్గుబాటి. అందుకే పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు.

పాత్ర న‌చ్చిందంటే ఏ భాష‌ అనేది చూడకుండా నటించి అందరీ మన్ననలు ని పొందుతున్నాడు రానా. హీరో గా న‌టించినా, విల‌న్ పాత్ర‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చినా గుర్తింపు మాత్రం చాలా వచ్చేస్తుంది. అందుకే భ‌ల్లాల దేవుడి గా ప్రపంచం మొత్తాన్ని మెప్పించ‌గ‌లిగాడు.

రావణుడిని పోలిన భ‌ల్లాల దేవ లాంటి పాత్ర‌లు పోషించి రక్తి కట్టించాలంటే రానా మాత్ర‌మే స‌రితూగుతాడు అనే రాజ ముద్ర‌వేసుకున్నాడు.

ఇటీవ‌ల సూపర్ స్టార్ రజినికాంత్ తో రానా చేసిన వెట్టేయాన్ లో విల‌న్ గా మెప్పించాడు. అందులో పెర్మార్మెన్స్ ఎంతో చక్కగా గా ఉంది. తెర‌పై కాసేపే క‌నిపించినా చాన్నాళ్లు గుర్తుండే రోల్ అది. రానాని ఆ క్యారెక్టర్ లో చూసిన త‌ర్వాత ఇలాంటి పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాడు అనిపించడం లో సందేహం లేదు.

Read Also : కాంతార తో వార్ అయేటట్లుందే

ఇలాంటి సమయం లో రానా దెగ్గరికి ఓ ఇంట్రెస్టింగ్ సినిమా ఆఫర్ వచ్చిందంట అదే ఎస్ ఎస్ ఎంబీ 29 లో రానా విల‌న్ గా ఎంపిక‌య్యాడు అనే ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో లో గట్టిగానే వినిపిస్తుంది.

ఇందులో రానా ఆఫ్రికాకు చెందిన ఒక ముఠా స‌భ్యుడి పాత్ర‌లో కనిపిస్తాడని అంటున్నారు. రాజ‌మౌళి అడగగానే రానా ఇందులో నటించడానికి ఒప్పుకున్నట్టు తెలిసింది.

అత‌డి పాత్ర భల్లాలదేవుడి పాత్ర కంటే అత్యంత కర్క‌శంగా ఉండ‌బోతుందిట‌. రానా గెట‌ప్ ఈ సినిమా లో హైలైట్ అవుతుంద‌ని తెలుస్తుంది.

రాజ‌మౌళి ప్రస్తుతం నిర్వ‌హిస్తోన్న సెషన్స్ కి కూడా రానా వెళ్తున్నాడని స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం.

Follow us on Instagram

Related posts

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

murali

తండేల్ : ‘బుజ్జి తల్లి’ గుండెల్ని పిండేసిందిగా …

murali

గేమ్ ఛేంజర్ : బిగ్గెస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్..?

murali

Leave a Comment