MOVIE NEWS

అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న పుష్పరాజ్..భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. దాదాపు మూడేళ్లుగా అల్లు అర్జున్ నుంచి సినిమా రాలేదు.. దీనితో ఫ్యాన్స్ పుష్ప 2 సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.. వరుస వాయిదాల తరువాత ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధం అయింది.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది.

OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో సైతం పుష్ప 2 ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు హిందీలో దాదాపు 12,500 టికెట్లు కేవలం పివిఆర్ ఐనాక్స్ ద్వారా బుక్ అయినట్లు సమాచారం.కేవలం మూడు గంటల వ్యవధిలో ఈ టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తుంది.. బుక్ మై షో లో కూడా పుష్ప 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఐకాన్ స్టార్ సరికొత్త రికార్డ్ సాధించాడు.. ఈ సినిమాను  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ టికెట్ రేట్ల గురించి అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలు చూసే విధంగా లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి.. అయితే అంతటి భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించారు కనుక టికెట్ రేట్స్ పెంచుకోవడం సబబే అని సినీ వర్గ ప్రముఖులు తెలియజేస్తున్నారు.. ఈ రేట్లు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయని ఆ తరువాత సాధారణ రేట్లకే ఈ సినిమా టికెట్స్ వుంటాయని వారు చెబుతున్నారు..తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పుష్ప టీం సంతోషంగా వుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా అనుమతి లభిస్తే పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మరింత పెరిగే అవకాశం వుంది..

Related posts

అన్ ప్రిడిక్టబుల్ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!!

murali

ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా ఇంపార్టెంట్ సమాచారాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్

filmybowl

Leave a Comment