Pushpa2 press meet tomorrow
MOVIE NEWS

ప్రమోషన్స్ షురూ చేయనున్న పుష్పా

Pushpa2 press meet tomorrow
Pushpa2 press meet tomorrow

Pushpa2 press meet tomorrow : ఎట్టకేలకు పుష్ప 2 మూవీ టీమ్ మీడియా ముందుకు వస్తున్నట్టు ఖరారైంది. ప్రెస్‍మీట్ డేట్ కూడా బయటికి వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలో కీలక ప్రకటన వస్తుందని బజ్ నడుస్తోంది.

ఈ సంవత్సరం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘పుష్ప 2: ది రూల్’ ముందు వరుసలో ఉంది. ఐకాన్ స్టార్ ( Allu Arjun ) అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ రేంజ్ లో ఈ సీక్వెల్ మూవీకి హైప్ ఉంది.

ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‍లో భారీ యాక్షన్ మూవీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరింది. రిలీజ్ దగ్గర పడుతుండటం తో చిత్ర బృందం మీడియా సమావేశం పెట్టనుంది.

హైదరాబాద్‍లో జరిగే ఈ ప్రెస్‍మీట్ లో నిర్మాతలు, కొందరు డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఈ మీట్‍కు హాజరవుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

పుష్ప 2 మూవీ షూటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే ఫస్టాఫ్ ఫైనల్ ఎడిటింగ్ కూడా పూర్తయింది. సెకండ్ హాఫ్ చిత్రీకరణ కాస్త మాత్రమే మిగిలి ఉంది. ముఖ్యంగా ఐటెం సాంగ్ చిత్రీకరించాల్సి వుంది అతిత్వరలో అది కూడా ఫినిష్ కానుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి.

పుష్ప 2 సినిమాను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు దానికి తగ్గట్టే ఏర్పాట్లు జరిగాయి. ఇటీవలే వచ్చిన పోస్టర్‌లోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అయితే, మేకర్స్ ఎందుకో విడుదల తేదీని ఒక రోజు ముందుకు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది.

Read Also :  ప్రభాస్ లుక్ పై మరోసారి పెదవి విరుస్తున్న నెట్టిజన్లు…

డిసెంబర్ 5వ తేదీనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు అదే విషయం ఈ ప్రెస్‍మీట్‍లో నిర్మాతలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

పుష్ప 2 సినిమా ఏకంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్ల మార్క్ దాటిందనే సమాచారం బయటికి వచ్చింది. థియేట్రికల్ హక్కులు, ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, ఆడియో, శాటిలైట్ కలిపి ఈ చిత్రానికి రూ.1100కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెజ్ జరిగిందని తెలుస్తోంది. ఈ విషయంలో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. సో చిత్ర బృందం ఫుల్ హ్యాపీ గా వుందని తెలుస్తుంది.

సో ఈ విషయాలన్నీ రేపు ప్రెస్మీట్ లో మాట్లాడే అవకాశం ఎంతైనా వుంది

Follow us on Instagram 

Related posts

అన్ ప్రిడిక్టబుల్ సాంగ్ వచ్చేసింది.. సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో..?

murali

బుక్ మై షో లో పుష్పరాజ్ మాస్ రికార్డ్.. ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే..?

murali

వెనక్కి తగ్గిన పుష్ప రాజ్.. ఆ సాంగ్ యూట్యూబ్ నుంచి తొలగింపు..!!

murali

Leave a Comment