ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న విడుదల అయి సంచలన విజయం సాధించింది..సంధ్య థియేటర్ ఘటన కారణంగా దేశావ్యాప్తంగా అల్లుఅర్జున్ సాధించిన క్రేజ్ ఒక్కసారిగా పోయింది.. బన్నీ కెరీర్ లో ఈ ఘటన ఒక బ్లాక్ మార్క్ లా మిగిలింది.. ఫ్యాన్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని అల్లుఅర్జున్ తెలుసుకున్నాడు.. తెలంగాణ సీఎం ఆగ్రహించడంతో ఫ్యాన్స్ ని వివాదాస్పద పోస్టులు చేయొద్దని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ని వేడుకున్నాడు..
ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!!
ఇదిలా ఉంటే ఈ వివాదం నేపథ్యంలో ‘పుష్ప 2’ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘దమ్ముంటే పట్టుకో షెకావత్’ అనే సాంగ్ను యూట్యూబ్ నుంచి తొలగించారు.సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారనే ఆరోపణలతో T సిరీస్ ఈ నిర్ణయం తీసుకుంది.విచారణలో భాగంగా మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వెళ్తున్న సమయంలోనే ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో క్షణాల్లోనే వైరల్ అయిన ఈ సాంగ్ పై ‘ఏం టైమింగ్ సార్’ అంటూ నెటిజన్లు కామెంట్ల చేసారు… కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే ఈ పాట రిలీజ్ చేశారనే ఆరోపణలు చేశారు. దీంతో పుష్ప 2 టీం మరో వివాదంలో చిక్కినట్లు అయింది..
ఈ వివాదం మరింత పెరిగేలోపే షెకావత్ సాంగ్ ను T సిరీస్ యూట్యూబ్ నుంచి డిలీట్ చేసింది. కానీ ఇప్పటికే భారీస్థాయిలో షేర్ అయిన సాంగ్.. సోషల్ మీడియాలో మాత్రం అందుబాటులోనే ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది…పుష్ప 2 సినిమా ఏమంటూ రిలీజ్ అయిందో కానీ వరుస వివాదాలు మేకర్స్ కి నిద్రపట్టనివ్వటం లేదు.. ఫ్యాన్స్ అత్యుత్సాహం అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసేంత వరకు వెళ్ళింది.. దీనితో ఫ్యాన్స్ ని రెచ్చేగొట్టే వ్యాఖ్యలు గానీ ప్రోగ్రామ్స్ చేయకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారు