MOVIE NEWS

బుక్ మై షో లో పుష్పరాజ్ మాస్ రికార్డ్.. ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి..గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా వున్నారు..ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..

దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్ నిర్వహించిన మేకర్స్ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా హైదరాబాదు లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.. ఇదిలా వుంటే మరికొన్ని గంటల్లో పుష్పరాజ్ థియేటర్‌లలో సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాడు. డిసెంబర్‌ 4 అర్ధరాత్రి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా బుక్‌ మై షోలో టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా పుష్ప 2 టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో మరో రికార్డు పుష్పరాజ్ సొంతమైంది.

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి భారీ ఊరట..టికెట్ రేట్స్ భారీగా పెంపు..!!

బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ టికెట్స్‌ అమ్ముడైన చిత్రంగా ‘పుష్ప2’ నిలిచింది. కేవలం బుక్‌ మై షో లోనే వన్‌ మిలియన్‌ టికెట్స్‌ సేల్ అవ్వడం విశేషం. ఓవర్సీస్‌లో సైతం ఈ సినిమా ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో హవా చూపింది… ఇటీవల హిందీ వెర్షన్‌ టికెట్స్‌ ఓపెన్‌ చేయగా 24 గంటల్లో ఏకంగా లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. బాలీవుడ్‌లో ఆల్‌టైమ్‌ టాప్ మూవీస్ లిస్ట్‌ లో ఈ చిత్రం మూడో స్థానం లో నిలిచింది. రిలీజ్‌కు ముందే వరుస రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!

murali

గేమ్ ఛేంజర్ : బిగ్గెస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్..?

murali

చరణ్ మీద ఎంతో భారం…. మోస్తాడంటారా…

filmybowl

Leave a Comment