MOVIE NEWS

మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి..

రీసెంట్ గా బీహార్ రాజధాని పాట్నాలో ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది..ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ వరుస ఈవెంట్స్ ప్లాన్ ప్లాన్ చేసారు..చెన్నై, కొచ్చి, ముంబై ఇలా వరుస ఈవెంట్స్ ప్లాన్ చేసారు.. ప్రమోషన్స్ తో పాన్ ఇండియా ఆడియన్స్ లో సినిమాపై బాగా హైప్ పెంచుతున్నారు..ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన కొచ్చి ఈవెంట్ లో సినిమాలోని మరో సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు..

సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..?

పీలింగ్స్ అని సాగే ఈ పాటలో మలయాళం పదాలు కూడా ఉండటంతో మేకర్స్ ఈ సాంగ్ ప్రోమోని కొచ్చి ఈవెంట్ లో రిలీజ్ చేసారు.. ఈ సాంగ్ లో రష్మిక, అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. పక్కా మలయాళ బీట్స్ లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఈ సాంగ్ ప్రోమో ప్రేక్షకులకి తెగ ఎక్కేసింది. దీనితో ఈ సాంగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు..ఈ మోస్ట్ అవైటెడ్ సాంగ్ ని ఈ డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు… మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..

Related posts

“పుష్ప 2” మొదటి షో పడింది.. ఇంతకీ టాక్ ఎలా ఉందంటే..?

murali

మరోసారి తమిళ దర్శకుడితో RaviTeja 76 సినిమా

filmybowl

చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా

filmybowl

Leave a Comment