MOVIE NEWS

పుష్ప సినిమాకు పార్ట్ 3 అవసరమా..నెటిజన్స్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతుంది.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరడంతో మన స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా మూవీలు చేస్తున్నారు.. అయితే కథకు ఏ మాత్రం సంబంధం లేకుండా రెండు భాగాలుగా సినిమాను విడగొడుతున్నారు.. గతంలో ఒక సినిమాగా తెరకెక్కే కథను రెండు,మూడు భాగాలూ చేసి మార్కెట్ బాగా పెంచుకుంటున్నారు.. దీనితో నిర్మాతలకు భారీగా లాభాలు రావడం విశేషం.. కథ బాగుంటే సెకండ్ పార్ట్ కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది.. కానీ కథ నచ్చకపోతే పార్ట్ 2 ఎంత భారీగా ప్రమోషన్ చేసినా కానీ ప్రేక్షకులు ముందు పార్ట్ తో పోల్చి చూస్తారు.. దీనితో పార్ట్ 2 సినిమా  2 వారాలకే బిచానా ఎత్తేస్తుంది.. ఈ సీక్వెల్స్ ట్రెండ్ పెద్ద సినిమాలకు సైతం వ్యాపించింది…

పుష్ప 2 : ఆ దేశంలో జాతర ఎపిసోడ్ తొలంగింపు..కారణం అదేనా..?

గతంలో కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి ఒక సినిమాను మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలకు సీక్వెల్ గా కేజీఎఫ్ 3 తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే కేజీఎఫ్3 ని తెరకెక్కించేందుకు సినిమాకు నిజంగానే స్కోప్ ఉంది. అయితే తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 సినిమాకు పార్ట్3( Pushpa 3 ) నిజంగా అవసరమా అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి..పుష్ప ది రూల్ సినిమాలోనే కథ లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి..

పుష్ప ది ర్యాంపేజ్ ను కూడా ఇలానే నడిపిస్తే మళ్ళీ పార్ట్ 4 అనేది తెరమీదకు వస్తుంది.. ఇలా అయితే ఎలా అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప ఫ్రాంఛైజ్ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వొచ్చేమో కానీ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతాయని మాత్రం చెప్పలేము. పుష్ప ది రూల్ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ సైతం మరీ అంత అద్భుతంగా అయితే లేదు.పుష్ప ది ర్యాంపేజ్ థియేటర్లలోకి రావడానికి మరో 5 సంవత్సరాల సమయం కచ్చితంగా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సుకుమార్ సినిమాలలో పుష్ప ది రూల్ వీక్ స్క్రిప్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్ ఈ నెగిటివ్ కామెంట్ల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

Related posts

గేమ్ ఛేంజర్ : చరణ్, అంజలీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది..!!

murali

గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

filmybowl

విశ్వంబర సినిమా లో అ….అ…అ

filmybowl

Leave a Comment