MOVIE NEWS

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ..ఇంటర్నేషనల్..ట్రైలర్ అదిరిపోయిందిగా ..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తాయి.పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ అలజడి సృష్టించిన అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా హ్యుజ్ ఫాలోయింగ్ ఏర్పడింది.టాలీవుడ్ లో  ఏ హీరో అందుకోలేని నేషనల్ అవార్డు సైతం అందుకొని అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.ఇదంతా పుష్ప సాధించిన ఘనతే..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.ప్రపంచమంతా ఒక స్వాగ్ లా ఫామ్ అయింది.పుష్ప తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఫహద్ ఫాసిల్ ,రావు రమేష్ ,సునీల్ ,అనసూయ వంటి స్టార్స్ మళ్ళీ పార్ట్ 2 లో కనిపించనున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి మరోసారి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అందించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా రెండు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పుష్ప 2 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా ప్రీమియర్స్ అడ్వాన్సు బుకింగ్స్ విపరీతంగా సేల్ అయ్యాయి.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెంచేందుకు మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.బీహార్ లోని పాట్నా లో ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించి తాజాగా పుష్ప 2 ట్రైలర్ ను లాంచ్ చేసారు.తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది.పుష్పా గాడి రేంజ్ ఈ సారి ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి..ట్రైలర్  అద్భుతంగా వుంది.. ట్రైలర్ లో బిజిఎం కూడా అదిరిపోయింది.ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు కనిపించాయి.ఈసారి పుష్పాగాడు దున్నేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Related posts

ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..?

murali

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ఆరు సినిమాలు అప్డేట్స్ తో రెడీ !

filmybowl

పుష్ప 2 గురించి దేవి మాటల్లో..

filmybowl

Leave a Comment