ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే పుష్ప రెండు పార్టులకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ గా నిలిచింది..ఈ రెండు సినిమాలకు దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది..
అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!!
ముఖ్యంగా పుష్ప రెండు భాగాల్లో స్పెషల్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఊ అంటావా మావ, కిస్సిక్ సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఇక త్వరలోనే పుష్ప 3 మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూడవ పార్ట్ పై ప్రేక్షకులలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 3 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని దేవిశ్రీ అన్నారు..అయితే పుష్ప 3 మూవీలో స్పెషల్ సాంగ్ లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో చెప్పాలని దేవి శ్రీ ప్రసాద్ ను అడగ్గా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా మావ అంటూ సమంత తన సూపర్ గ్లామర్ తో దుమ్మురేపింది.. పుష్ప 2లో శ్రీలీల కిస్సిక్ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని ఆ పాటకు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను నిర్మాతలకు ముందే చెప్పానని దేవిశ్రీ తెలిపారు.
పుష్ప 3 లో స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్ ఎవరనేది ఇప్పటి నుంచే ప్రేక్షకులలో ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయని అన్నారు. కానీ ఆ విషయం పై దర్శకనిర్మాతలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్ కు తాను వీరాభిమానని దేవిశ్రీ అన్నారు.జాన్వీ కపూర్ సైతం సూపర్ డ్యాన్సర్ అని.. ఇప్పటికే హిందీలో ఎన్నో పాటల్లో నటించారని.. పుష్ప 3 కోసం జాన్వీ కపూర్ సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ తెలిపారు.