MOVIE NEWS

పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. ప్రస్తుతం ఈ సినిమా టాప్ ట్రెండింగ్ గా నిలుస్తుంది.. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మేకర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదల చేయనున్నారు..అయితే తాజాగా బాలీవుడ్ మీడియా ఈ సినిమా వాయిదా పడవచ్చు అనే వార్తలు ప్రచురించింది.దీంతో  పుష్ప వాయిదా పడబోతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు..

పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!!

అయితే వాయిదా విషయంపై బాలీవుడ్ మీడియా అలా ప్రచురించడానికి గల ఓ ప్రత్యేక కారణం కూడా వుంది..ఇంకా పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడమే దీనికి అసలైన కారణం..డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా జరుగుతూ ఉంది అనే వార్తల కారణంగా కచ్చితంగా సినిమా వాయిదా పడుతుంది అంటూ ప్రచారం మొదలు అయింది..నిజానికి సుకుమార్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. కేవలం సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది… ఆ సాంగ్ షూటింగ్ కూడా తాను హాజరు కాకుండా పూర్తిగా కొరియోగ్రాఫర్ మీదే బాధ్యత పెట్టినట్లు సమాచారం

డిసెంబర్ 5 వ తేదీన ఈ సినిమా కచ్చితంగా రిలీజ్ చేయాలంటే నవంబర్ 26 , 27 లోపల పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సెన్సార్ కి పంపించాల్సి ఉంటుంది.కనుక ఇంత హడావుడిగా షూటింగ్ పూర్తి చేయడం కష్టమని భావించిన బాలీవుడ్ మీడియా వాయిదా కథనాలు ప్రచురించింది..అయితే తాజా సమాచారం మేరకు ఇప్పటికే సాంగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కానుంది… సుకుమార్ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టాడు కాబట్టి అనుకున్న టైం కి మొదటి కాపీ రెడీ చేసి సెన్సార్ కి పంపిస్తారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ వాయిదా పడకుండా చూసే బాధ్యత సుకుమార్ పై వుంది…

Related posts

రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా ఇంపార్టెంట్ సమాచారాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్

filmybowl

ఎదో ఒక డేట్ చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా చైతూ

filmybowl

పుష్ప 2 : కల్యాణ్ బాబాయ్ థాంక్యు..అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

murali

Leave a Comment