MOVIE NEWS

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”.. ప్రస్తుతం ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప సినిమా కంటే మరింత భారీగా పుష్ప 2 సినిమాను మేకర్స్ రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్,సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ సిద్ధమవగా సెన్సార్ కూడా పూర్తయింది.

ఆ భాషలో ఎప్పటికీ నటించను.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!

నైజాం ప్రాంతాల్లో ఈ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ విషయమే సరికొత్త టెన్షన్ ను తెరమీదకు తీసుకొచ్చింది. ఈ సినిమాని ఇంత రేట్ పెట్టి చూడటం కరెక్ట్ కాదని చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు.

డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 నుంచే ఈ సినిమా బెనిఫిట్ షోస్ వేయాలని ఆరోజు అర్ధరాత్రి సమయంలో స్పెషల్ షోస్ వేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఏపీలో టికెట్ల రేట్ల విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఏపీలో కూడా ఇవే రేట్స్ కనుక కంటిన్యూ అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. టికెట్స్ రేట్లు తగ్గిస్తే అందరూ చూడటానికి వీలుగా ఉంటుందని ఇలాంటి రేట్స్ వల్ల సామాన్యుడు థియేటర్ కి వచ్చి సినిమా చూడలేని పరిస్థితి వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు..

Related posts

పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!!

murali

ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

మహేష్ కు రాజమౌళి సరికొత్త కండిషన్స్.. బాబు పాటిస్తాడా..?

murali

Leave a Comment