MOVIE NEWS

పుష్ప 2 : జాతర ఎపిసోడ్ కి మాస్ బిజిఏం ఇచ్చింది ఆ మ్యూజిక్ డైరెక్టరేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప: ది రూల్’..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..మరో తొమ్మిది రోజుల్లోనే పుష్ప రాజ్ ప్రేక్షకుల వద్దకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు…దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్లు చాలా గట్టిగానే ప్లాన్ చేస్తోంది.ఈ సినిమాపై అంచనాలు ఏ మాత్రం ఉన్నాయో అనుమానాలు అలానే వున్నాయి.. ఈ సినిమాకు దేవిశ్రీ ఇష్యూ కాస్త నెగటివ్ గా మారింది..

పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!!

అయితే ఈ వివాదం వల్ల ఈ చిత్రానికి పబ్లిసిటీ బాగానే వచ్చింది.దర్శకుడు సుకుమార్ తన ఆస్థాన సంగీత దర్శకుడైన దేవిశ్రీ ఉండగా.. బీజీఎం బాధ్యతలను వేరే సంగీత దర్శకులకు అప్పగించేందుకు నిర్ణయించుకోవడం దేవిశ్రీకి కోపం తెప్పించింది… తమన్‌తో పాటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌లను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా అని దేవిశ్రీ ని పక్కన పెట్టేయలేదు. దేవిశ్రీ కూడా బీజీఎం మీద వర్క్ చేస్తున్నాడు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారికి సుకుమార్ కొన్ని సీన్లు పంచారు. అందరి బిజిఏం విని ఏది షూట్ అయితే అది తీసుకోవాలన్నది సుకుమార్ ఆలోచన.

ఇప్పటికే దేవి మొత్తం సినిమాకు తన బిజీఏం స్కోర్ దాదాపుగా పూర్తి చేశాడు.సినిమాలో మెజారిటీ సీన్లలో దేవిశ్రీ బీజీఎంనే వాడుతున్నారు. సామ్ సీఎస్ తనకు అప్పగించిన సీన్లకు బీజీఎం పూర్తి చేసి టీంకు అప్పగించేశాడు. అందులో జాతర ఎపిసోడ్‌కు అతను అదిరిపోయే స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో పాటు మరో సన్నివేశానికి సామ్ స్కోర్‌ను సుకుమార్ లాక్ చేశాడట. సామ్ కూడా సోషల్ మీడియాలో పుష్ప-2 పోస్టర్ పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు .అయితే అజనీష్ లోక్‌నాథ్ తన వర్క్ కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడని తెలుస్తుంది. గత మంగళవారమే అతను తాను అందించిన స్కోర్‌తో హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.. ఇక తమన్ వర్క్ విషయంలో సుకుమార్ అంత సంతృప్తిగా లేడని సమాచారం.. తమన్ బిజీఏం సినిమాలో ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతుంది..

Related posts

ఇంకో ఐదేళ్లు రాజమౌళి జైల్లోనే మహేష్.. నిరాశలో ఫ్యాన్స్..!!

murali

మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!!

murali

పుష్ప 2 గురించి దేవి మాటల్లో..

filmybowl

Leave a Comment