ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించినలేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ పుష్ప 2 ‘ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.
RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో మున్నా భయ్యా.. లుక్ అదిరిందిగా..!!
బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ ఇండియా వైడ్ గా భారీ ఈవెంట్స్ ని ఏర్పాటు చేశారు. మొన్న చెన్నై, నిన్న కొచ్చి, నేడు ముంబై ఇలా వరుసగా ఈవెంట్స్ ఏర్పాటు చేసి పుష్ప2 సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెంచేశారు. రీసెంట్గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు మూడు గంటల 20 నిమిషాల నిడివితో థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలను సెన్సార్ బోర్డ్ కత్తిరించింది
ఇదిలా అంటే ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. తాజాగా పుష్ప2 సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. డిసెంబర్ 4న రాత్రి 9:30 నిమిషాలకు, అర్ధరాత్రి ఒంటిగంట వరకు బెన్ఫిట్ షోలకు ఓకే చెప్పింది. వీటి టికెట్ ధరలని సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లో ₹800లుగా ఖరారు చేసింది.డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్₹150,మల్టీఫ్లెక్స్ ₹200 చొప్పున, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ ₹105,మల్టీప్లెక్స్ ₹150 చొప్పున టికెట్లు రేట్లు పెంపునకు అనుమతినిచ్చింది..