MOVIE NEWS

పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కి రంగం సిద్ధం ..ఇక మాస్ జాతరే ..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా వస్తుంది.పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.”తగ్గేదే లే” అనే ఒక్క డైలాగ్ అల్లు అర్జున్ కి పిచ్చ క్రేజ్ తీసుకొచ్చింది.దీనితో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

అంతటి సంచలనం సృష్టించిన పుష్ప సినిమాకు సీక్వెల్ అంటే క్రేజ్ ఏ మాత్రం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.బీహార్ రాజధాని అయిన పాట్నాలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేసారు.రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.ఈ ఊపులోనే మేకర్స్ మరిన్ని భారీ ఈవెంట్స్ ప్లాన్ చేసారు.

డాకు మహారాజ్ : అసలు విలన్ ఆయనే..బాలయ్య ఫ్యాన్స్ కి బాబీ బిగ్ సర్ప్రైజ్ ..!!

మొన్న నార్త్ లో రచ్చ లేపిన పుష్ప రాజ్ తరువాత సౌత్ లో రచ్చ చేసేందుకు సిద్ధం అయ్యాడు.పుష్ప 2 మేకర్స్ చెన్నై లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసారు.”మక్కలే, సింగర చెన్నై లా ఓరు స్పెషల్ ఈవెనింగ్ కు సిద్ధంగా ఉన్నారా? నవంబర్ 24న సాయంత్రం 5 గంటల నుండి పుష్ప వైల్డ్‌ఫైర్ ఈవెంట్.. లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కళాశాలలో” జరగనుంది అని పుష్ప యూనిట్ ఎక్స్ లో ట్వీట్ చేసారు. బీహార్ లో భీభత్సం సృష్టించిన అల్లు అర్జున్.. ఇక చెన్నైలో ఎలాంటి అలజడి సృష్టిస్తాడో చూడాలి.

Related posts

పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..?

murali

అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..?

murali

ఎస్ఎస్ఎంబి : చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమం.. ప్లీజ్ ఒక్క ఫోటో కావాలంటున్న ఫ్యాన్స్..!!

murali

Leave a Comment