MOVIE NEWS

పుష్ప 2 : ఐకాన్ స్టార్ సినిమాకి ఆ మెగా హీరో బెస్ట్ విషెస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘’పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..నేడు (డిసెంబర్ 4 ) అర్ధరాత్రి ఈ సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.. ఈ సినిమాకు మొదటి రోజు భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

రేపు ప్రప్రంచవ్యాప్తంగా పుష్ప గాడి రూల్ మొదలు కానుంది.. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎంతో హంగామా చేస్తున్నారు.. ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే ప్రపంచవ్యాప్తంగా పుష్పరాజ్ సునామిని ఆపడం ఎవ్వరి వల్ల కాదు.. ఈ సినిమాపై మేకర్స్ చాలా ధీమాగా వున్నారు.. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప సినిమాకు భారీగా టికెట్ రేట్స్ పెంపుకు అనుమతి ఇవ్వడంతో ఫ్యాన్స్ సైతం టికెట్స్ కొనలేని పరిస్థితి ఏర్పడింది.. అయినా కూడా ఫ్యాన్స్ అంతా సినిమాను చూసేందుకు ఎంతో ఆత్రుతగా వున్నారు.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీ తో వచ్చిన క్లాషెస్ కారణంగా పుష్ప 2 సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా పోయింది.. పవన్ కల్యాణ్ తో గొడవ కారణంగా మెగా ఫ్యాన్స్ అంతా పుష్ప 2 ని బాయ్ కాట్ చేయాలనీ చూసారు.. దీనితో మెగా vs అల్లు వివాదం మరింత ముదిరింది..ఈ ఇష్యూ పై మెగాస్టార్ సైతం స్పందించకపోవడంతో ఇక అల్లు అర్జున్ కి మెగా సపోర్ట్ ఉండదని అంతా భావించారు.ఈ క్రమంలో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా “పుష్ప 2 “ టీం కు విషెస్ తెలిపారు..అల్లుఅర్జున్, సుకుమార్ అండ్ మూవీ టీం అంతటికి నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసారు..ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియలో బాగా వైరల్ గా మారింది..

Related posts

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

murali

ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..?

murali

Leave a Comment