MOVIE NEWS

పుష్ప 2 : మరో సర్ప్రైజ్ కి సిద్ధమవుతున్న మేకర్స్.. ఓటీటీ వెర్షన్ లో మరో సన్నివేశం..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది.. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 రికార్డు ను సైతం చేరిపేసి పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.. ‘పుష్ప 2’ సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపధ్యం లో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మరొక 20 నిమిషాల పుటేజ్ ని యాడ్ చేసి ఈ సినిమా రీ లోడెడ్ వెర్షన్ ను జనవరి 17 న మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ రీ లోడెడ్ వెర్షన్  కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాను మళ్ళీ చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

NC24 : నాగచైతన్య థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

ఈ సినిమాలో అదనంగా కలిపిన 20 నిమిషాల సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో పుష్ప జర్మనీకి వెళ్లడానికి 40 రోజుల పాటు ఒక ట్రక్ లో ఎలా ఉన్నాడు అనేదానికి మిస్ అయిన లాజిక్ కి క్లారిటీ ఇచ్చారు..ప్రస్తుతం ఈ సినిమాపై సెలబ్రిటీలు అంతా ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా నిలవాలనే లక్ష్యంతో పుష్ప 2 సినిమా బాక్స్ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో సరికొత్త సన్నివేశాన్ని కూడా జోడిస్తూ ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈసారి 10 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను జోడించి ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లోకి గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే రీలోడెడ్ వర్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా ఓటీటిలో మరో 10 నిమిషాల సన్నివేశంతో ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు..

Related posts

లండన్ వీధుల్లో ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

murali

పుష్ప 2 టికెట్ ధరలు భారీగా పెంపు ..పెరిగిన ధరలు ఎలా వున్నాయంటే..?

murali

సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ #27 గా అశోక్ గల్లా చిత్రం ప్రారంభం

filmybowl

Leave a Comment