MOVIE NEWS

పుష్ప 2 : ఆ దేశంలో జాతర ఎపిసోడ్ తొలంగింపు..కారణం అదేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న “పుష్ప 2” జాతర ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా మొదలైంది..ఈ సినిమాను చూసేందుకు థియేటర్స్ వద్ద ప్రేక్షకులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచే పుష్ప 2 ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు కూడా పూర్తయ్యాయి. ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులెవ్వరిని అడిగినా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ హాట్ అని చెబుతున్నారు..ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మన్స్ హైలైట్ గా నిలిచింది..మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో వున్నాయి..

పుష్ప 2 : రిలీజ్ సమయంలో నాగబాబు సంచలన ట్వీట్..!!

కూలీ నుంచి సిండికేట్ కింగ్ గా ఎదిగిన పుష్ప రాజ్ తన రూల్ ఎలా కొనసాగించాడు అనేది ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్ అద్భుతంగా చూపించాడు.. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో అద్భుతంగా తెరకెక్కించారు… ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ మాత్రం సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ లో పుష్ప ఇంట్రడక్షన్ సీన్ అలాగే ఇంటర్వల్ బ్లాక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయి.. ఈ సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ అలాగే డైలాగ్స్ సైతం ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి… ఫస్ట్ హాఫ్ ని ఎక్కువగా డ్రామాతో నడిపించిన సుకుమార్..సెకండ్ హాఫ్ ని మాత్రం అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేసాడు..

ముఖ్యంగా 20 నిమిషాల జాతర ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు…అయితే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ కి ప్రేక్షకులు కుర్చీలో కూర్చోలేక పోయారు.. ఐకాన్ స్టార్ కి పుష్ప 2 తో దర్శకుడు సుకుమార్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు..ఇదిలా ఉంటే తాజాగా పుష్ప 2 సినిమాకు సౌదీ అరేబియా సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది..ఇందులో జాతర ఎపిసోడ్ తొలగించినట్లు నేషనల్ మీడియా ప్రకటించింది..బన్నీ అమ్మవారి గెటప్ పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం..దీనితో 3 గంటల నిడివితోనే అక్కడ పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది..

Related posts

రాంచరణ్ : ఆ విషయంలో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అర్ధం కావట్లేదు..!!

murali

బన్నీ నేషనల్ అవార్డు పై సరికొత్త రచ్చ.. అసలు ఏం జరుగుతుంది..?

murali

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్ ఏంటి ?

filmybowl

Leave a Comment