MOVIE NEWS

పుష్ప 2 : కల్యాణ్ బాబాయ్ థాంక్యు..అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే పుష్ప సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.. ఈ సినిమాలో అల్లు అర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ అదిరిపోయింది.ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి..ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది. దీనితో మేకర్స్ పుష్ప 2 సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు..

ఏకంగా నాలుగు పాన్ ఇండియా హిట్స్.. ఆ కన్నడ విలన్ జోరు మాములుగా లేదుగా..!!

ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా మొత్తాన్ని హిట్ చేసేది దర్శకుడు మాత్రమేనని అల్లు అర్జున్ అన్నారు..ఈరోజు ఈ సినిమాతో నాకు పేరు వచ్చినా వేరే ఆర్టిస్టులకు పేరు వచ్చిన ఆ క్రెడిట్ అంతా ఒక్కడికే చెందుతుంది.నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా సరే అవన్నీ ఆ పాత్ర సృష్టించిన దర్శకుడికే చెందుతాయి . నేను ఈరోజు ఈ స్థాయిలో వున్నాను అంటే నామీద సుకుమార్ కి ఉన్న ప్రేమే కారణం. ఇంతకంటే నేనేం చెప్పగలను డార్లింగ్ అని బన్నీ ఎమోషనల్ అయ్యారు…

ముందుగా నేను తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థాంక్స్ చెబుతున్నాను. మా సినిమాకి స్పెషల్ హైక్ ఇచ్చినందుకు అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారి సపోర్టు కూడా చాలా అద్భుతంగా ఉందని బన్నీ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు..ఎప్పటినుంచో సినీ పరిశ్రమ మీద మీ ప్రేమ కొనసాగుతూనే ఉంది. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను సర్ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు..ఈ స్పెషల్ జీవో పాస్ అయ్యి స్పెషల్ హైక్స్ రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను.. అలాగే పర్సనల్ గా కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ అంటూ పేర్కొన్నారు.

Related posts

దేవర రికార్డుల ఊచకోత మొదలు

filmybowl

ప్రభాస్ కోసం మరో ‘లెజెండరీ యాక్టర్ ని తీసుకొస్తున్న మైత్రి మూవీ మేకర్స్

filmybowl

దేవర సినిమా తో నార్త్ లో పాగా వేసిన ఎన్టీఆర్

filmybowl

Leave a Comment