MOVIE NEWS

పుష్ప 2 :ఆ కీలక సన్నివేశాలు ఎడిట్ చేసిన సుకుమార్.. దాని కోసమేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది.. సినిమా మొదలు నుండి ఆఖరు వరకు అల్లుఅర్జున్ మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.. సుకుమార్ టేకింగ్ కూడా అదిరిపోతుంది..అయితే నిడివి పరంగా సుకుమార్ సినిమాలన్నీ కాస్త లెంగ్తీగానే ఉంటాయి..’పుష్ప 2′ రన్ టైమ్ అయితే మరింత ఎక్కువ వచ్చింది.. ఏకంగా 3 గంటల 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన సినిమా ఇది.

పుష్ప 2 : 90 శాతం బిజిఎం నాదే..సామ్ సిఎస్ షాకింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాని ట్రిమ్ చేయమని నిర్మాతలు అడిగినా కూడా సుకుమార్ ఒప్పుకోలేదట..’మూడున్నర గంటల సినిమా అయినా కూడా ప్రతీ ప్రేక్షకునికి రెండున్నర గంటల సినిమాలా అనిపిస్తుంది’ అని నిర్మాతలే ఫైనల్ కాపీ చూశాక ప్రేక్షకులకి సర్ది చెప్పుకొన్నారు.అయితే ఫ్యాన్స్ సైతం రన్ టైమ్ విషయమై ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవడం గమనార్హం అయితే ఈ సినిమా రన్ టైమ్ విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది… ఈ సినిమా ఫైనల్ రష్ 4 గంటల వరకూ వచ్చిందని సమాచారం… అందులో 40 నిమిషాల్ని ఎడిటింగ్ లో భాగంగా సుకుమార్ కట్ చేశాడట.. అయితే అందులో కూడా చాలా మంచి సీన్లు ఉన్నట్లు సమాచారం.

తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కేశవ పాత్ర పరిధి చాలా తగ్గింది. దానికి కారణం ఎడిటింగ్ లో కేశవకు సంబంధించిన కొన్ని సీన్లు తొలగించాల్సి వచ్చింది.క్లైమాక్స్ ని ఇంకా ఎక్స్‌టెన్షన్ చేశారు.., చివర్లో పార్ట్ 3కి సంబంధించిన ఓ లీడ్ సీన్ ఉంటుందట దాన్ని సైతం ఎడిట్ చేశారని సమాచారం. ఆ 40 నిమిషాల ఫుటేజీని పార్ట్ 3లో వాడుకొనే అవకాశం ఉండడంతో వాటిని పక్కన పెట్టాల్సివచ్చిందని తెలుస్తోంది.. సినిమా విడుదలైన కొన్ని రోజుల తరవాత, కొత్తగా సీన్స్ యాడ్ చేయడం సహజంగా చూసేదే. ఈ సినిమాకూ అలాంటి ఛాన్స్ కూడా వున్నట్లు తెలుస్తుంది.అయితే ఇప్పటికే 3 గంటల 20 నిమిషాల సినిమా కావడంతో ఇంకా యాడ్ చేస్తే ప్రేక్షకుడు బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనితో కొత్త సన్నివేశాల్ని జోడించే ఆలోచన చిత్రబృందం విరమించుకున్నట్లు సమాచారం.

Related posts

అన్ ప్రిడిక్టబుల్ సాంగ్ వచ్చేసింది.. సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో..?

murali

పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!!

murali

గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా..?

murali

Leave a Comment