ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప పార్ట్ 1” ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ పిచ్చ పాపులర్ అయ్యేలా చేసింది మాత్రం పుష్ప రాజ్ క్యారెక్టర్.. తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియాను షేక్ చేసాడు.. నార్త్‌లో ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల నుంచి కలెక్షన్లు భారీగా వచ్చాయి.పార్ట్ 1 అదిరిపోయే హిట్ అందుకోవడంతో ఇక నెక్ట్స్ అందరూ పుష్ప పార్ట్ 2 కోసం ఎదురుచూసారు.
పుష్ప 2 : ఆ సీన్ చూసాక రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం అదేనా..?
అలా ఎదురుచూస్తున్న సమయంలో అల్లు అర్జున్ బర్త్ డే వచ్చింది. 2023 ఏప్రిల్ 8వ తేదీ ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 7 తేదీనే సుకుమార్ ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. అదే వేర్ ఈజ్ పుష్పా…గ్లింప్స్ 3 నిమిషాల 18 సెకన్లు ఉన్న ఆ వీడియో పుష్ప 2 మూవీపై భారీగా అంచనాలను క్రియేట్ చేసింది…పుష్పరాజ్‌పై పోలీసులు పది రౌండ్స్ కాల్పులు జరపడంతో, తీవ్ర గాయాల పాలు అవ్వడంతో, పుష్ప అడవుల్లోకి పారిపోయాడు అంటూ న్యూస్ తో మొదలయ్యే ఆ వీడియో ప్రేక్షకులలో పుష్ప 2 పై క్యూరియాసిటీ పెంచుతుంది…
అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేసినాయంటే పులిచ్చొండాదని అర్థం. మరి పులి రెండు అడుగులు వెనక్కి వేసినాదంటే పుష్ప వచ్చుండాడని అర్థం” అనే డైలాగ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది. అల్లు అర్జున్ ని చూసి పులి వెనక్కి అడుగు వేయడం కూడా గూస్ బంప్స్ వచ్చేలా చేసాయి..అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాలో అలాంటి సీన్స్ ఏమి వుండవు..దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు..అంతటీ గ్రాండ్ ఎలివేషన్ ఉండే సీన్ ఎందుకు సినిమాలో పెట్టలేదు అంటూ సుక్కుపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ సీన్స్ కూడా ఉండి ఉంటే పుష్ప సినిమాపై హైప్ మరింత వచ్చేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..
రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!