MOVIE NEWS

పుష్ప 2 : ఆ విషయంలో భారీ రిస్క్ చేస్తున్న సుకుమార్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2′ మూవీ ఫీవర్ ప్రపంచమంతా వైరల్ గా మారింది.. పుష్ప 2 రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సుకుమార్ టీమ్ మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై పూర్తి ఫోకస్ పెట్టింది.. మూవీ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది..ఈ మూవీతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతుని ఇచ్చేందుకు మూవీ టీం బాగా కష్టపడుతుంది.. పుష్ప సినిమా కంటే భారీ స్థాయిలో అంచనాలు ఉండటంతో ఈ మూవీ కచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. దేశంలోనే హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది..జరిగిన బిజినెస్ కి తగ్గట్లుగానే మూవీ కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు..

ఇదిలా ఉంటే గతంలో పుష్ప సినిమాకి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సాంగ్స్ అందించడంతో పాటు అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం అందించి అందరిని ఎంతగానో మెప్పించాడు. అలాగే ‘పుష్ప 2’ మూవీకి కూడా దేవిశ్రీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వచ్చిన” ఊ అంటావా మావ” అనే ఐటెం సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది… అయితే ఈ చిత్రంలో వచ్చే ఐటెం సాంగ్ కూడా ట్రెండ్ సెట్ చేయడం గ్యారెంటీ అని అంతా అనుకుంటున్నారు.అయితే ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే  వర్క్ చేయడం లేదు. థమన్ ఈ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం వర్క్ చేస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. అలాగే తనతో పాటు మరికొంతమంది కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పనిచేస్తున్నారని పరోక్షంగా తెలిపారు. అందరం కలిసి వాట్సాప్ గ్రూప్ లో కనెక్ట్ అవుతూ కమ్యూనికేట్ అవుతున్నామని, ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్ ఇస్తామని ఆయన అన్నారు..

Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ కు దూరంగా సుకుమార్.. కారణం అదేనా..?.

దీంతో ‘పుష్ప 2’కి బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పనిచేస్తోన్న మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరనే ప్రశ్న సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది.. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న సమాచారం మేరకు అయితే అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారని సమాచారం..దేవిశ్రీప్రసాద్ తో కలుపుకొని మొత్తం నలుగురు ‘పుష్ప 2’ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం పని చేస్తున్నారని తెలుస్తుంది..అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయంలోనే మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు టైటిల్ కార్డ్స్ లో వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే బాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సుకుమార్ పెద్ద రిస్క్ చేస్తున్నారనీ ఇండస్ట్రీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.. వర్కౌట్ అయితే ఓకే కానీ బెడిసి కొడితే మాత్రం చాలా నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు..

Related posts

బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

ఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!!

murali

సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..?

murali

Leave a Comment