pushpa 2 sukumar away from the trailer event is that the reason
MOVIE NEWS

Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ కు దూరంగా సుకుమార్.. కారణం అదేనా..?

Pushpa 2 Trailer : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లెక్కల మాస్టారు నుంచి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.సుకుమార్ సినిమాలు ప్రేక్షకులకు అసరికొత్త అనుభూతిని ఇస్తాయి.సుకుమార్ తన కెరీర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు.అయితే సుకుమార్ కి బాగా పేరు తీసుకొచ్చిన సినిమా పుష్ప..ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2..పుష్ప సినిమాలో పుష్ప రాజ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు.. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది.. ఎక్కడికి వెళ్లిన “పుష్ప తగ్గేదేలే” డైలాగ్ మారు మ్రోగిపోయింది.. ప్రస్తుతం వస్తున్న సీక్వెల్ కి కూడా అదే రేంజ్ లో అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను మరింత భారీగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు..

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మూడేళ్లుగా ఎలాంటి సినిమా చేయలేదు..పుష్ప సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..దాదాపు మూడేళ్ల తరువాత అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో ఫహాద్ ఫాసిల్, రావు రమేష్, సునీల్, అనసూయ, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.. గతంలో దేవిశ్రీ పుష్ప కి ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ కి గాను నేషనల్ అవార్డు అందుకున్నాడు..

Also Read : పుష్ప 2 : ఆ విషయంలో భారీ రిస్క్ చేస్తున్న సుకుమార్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

ఈ సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రెండు పాటలు రిలీజ్ చేయగా రెండూ చార్ట్ బస్టర్ గా నిలిచాయి..ఇదిలా ఉంటే నేడు (నవంబర్ 17 ) న బీహార్ లోని పట్నాలో పుష్ప 2 మాస్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు..ఈ ట్రైలర్ లాంచ్ కి మేకర్స్ భారీ ఈవెంట్ నీ ప్లాన్ చేసారు.. అయితే ఈ ఈవెంట్ కి సుకుమార్ హాజరు కావడంలేదనే న్యూస్ వైరల్ అవుతుంది..దీనికి కారణం ఈ చిత్రానికి సంబంధించి పెండింగ్ పనులు ఎక్కువగా ఉండటమే..దీనితో ఆయన హైదరాబాద్ లోనే ఉంటారని సమాచారం. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Follow us on Instagram

Related posts

తెలుగు సినిమా అభిమానుల మధ్య మళ్ళి రాజేసుకున్న కలెక్షన్స్ కుంపటి.

filmybowl

తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!!

murali

ఇంకో ఐదేళ్లు రాజమౌళి జైల్లోనే మహేష్.. నిరాశలో ఫ్యాన్స్..!!

murali

Leave a Comment