MOVIE NEWS

పుష్ప 2 : వైల్డ్ ఫైర్ ఈవెంట్ కోసం రంగంలోకి దిగిన స్టార్ సింగర్స్..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”..ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు..
ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా మేకర్స్ బీహార్ రాజధాని పాట్నాలో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.. రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. దీనితో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..

ఈ సినిమా విడుదల కావడానికి మరికొద్ది రోజులే సమయమే ఉండడంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసిన విషయం తెలిసిందే.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా వైల్డ్ ఫైర్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప వైల్డ్ ఫైర్ హంగామానే నడుస్తోంది.. అయితే పుష్ప టీమ్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు సమాచారం.ప్రతీ ప్రమోషనల్ ఈవెంట్ ని మరింత కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

ఇప్పటికే ట్రైలర్ ఈవెంట్ పాట్నాలో చెయ్యగా ఇప్పుడు చెన్నై లో ఒక మ్యూజికల్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించనున్నారు. చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ నవంబర్ 24న సాయంత్రం 5 గంటల నుండి జరగనుంది..ఈ ఈవెంట్ లో ప్రముఖ స్టార్ సింగర్స్ లైవ్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.ఈవెంట్ కోసం స్టార్ సింగర్స్ ని మూవీ మేకర్స్ రంగంలోకి దింపారు.రేపు విడుదల కానున్న కిస్సిక్ సాంగ్ ని సుబ్లాషిణి,ఆండ్రియా జెరెమియా ఊ సోల్రియా మావా సాంగ్ అలాగే రాజలక్ష్మి సామీ సామీ పాటలు పాడనున్నారు. రేపు ఈ ఈవెంట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది..

Related posts

ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

ముదురుతున్న మంచు వారింట రచ్చ..ఎక్కడికి దారితీస్తుందో..?

murali

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

Leave a Comment