MOVIE NEWS

పుష్ప 2 : పాట్నా ఈవెంట్ పై సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి సంచలనాలు సృష్టిస్తుంది..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్కు ఇస్తుంది.. పుష్ప సినిమా గత నాలుగు రోజుల్లో ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో అని సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్య పోతున్నారు.. ప్రపంచమంతా పుష్ప 2 పై ప్రశంసలు కురిపిస్తుంటే హీరో సిద్దార్థ్ మాత్రం ఈ సినిమాపై కాస్త హార్ష్ గా స్పందిస్తున్నారు..

తాజాగా పుష్ప 2 పై సిద్దార్థ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఆయన నటించిన ‘మిస్ యూ’ సినిమా తమిళనాడులో తుఫాన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.నవంబర్ 29న విడుదల కావాల్సిన ఈ సినిమా… డిసెంబర్ 13న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే నవంబర్ 29న విడుదల అనుకున్నప్పుడు చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సిద్ధార్థ్.. ‘పుష్ప 2’పై చేసిన కామెంట్స్ వైరల్ అవగా.. ఇప్పుడు మరోసారి ఆయన ‘పుష్ప 2’ ప్రమోషన్స్ నిమిత్తం పాట్నాలో జరిగిన భారీ వేడుకపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

పుష్ప 2 : క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా.. ఇదిగో ప్రూఫ్..!!

‘పుష్ప2 ది రూల్’ ప్రమోషన్స్ నిమిత్తం పాట్నాలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ఆ సినిమా ట్రైలర్ లాంచ్ చేసారు….ఆ ఈవెంట్ కి ప్రేక్షకులు భారీగా తరలి వచ్చారు.. ఒక జాతరకు,ఒక పొలిటికల్ మీటింగ్ కి ఎలా అయితే జనాలు వస్తారో అంతకంటే ఎక్కువగా ఆ ఈవెంట్ కి ప్రేక్షకులు తరలివచ్చారు..అయితే ఆ వేడుకకు జనాలు ఎలా వచ్చారో చూశారా.. అనే ప్రశ్న ‘మిస్ యూ’ ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ కి ఎదురైంది.ఆ ప్రశ్నకు సిద్ధార్థ్ సెటైరికల్ గా సమాధానమిచ్చాడు.

‘‘అది అసలు పెద్ద విషయమే కాదు. అది మార్కెటింగ్ జిమ్మిక్కు. ఇండియాలో జనాన్ని సమీకరించడం పెద్ద విషయమేమి కాదు. ఒక కన్స్ట్రక్షన్ దగ్గర జేసీబీ వర్క్ జరుగుతున్నా కూడా జనాలు గుమిగూడతారు. బిర్యానీ ప్యాకెట్, మందు ఇస్తే చాలు పొలిటికల్ మీటింగ్స్ కి జనాలు వస్తారని పొలిటికల్ మీటింగ్స్ సమయంలో మనం మాట్లాడుకుంటాం కదా. జనాలు వస్తేనే సినిమా సక్సెస్ అనుకుంటే.. పొలిటికల్ మీటింగ్స్ పెట్టిన వారంతా గెలుస్తున్నారా లేదు కదా..ఇండియాలో ఏ ఫంక్షన్ కి అయినా మీటింగ్ కి అయినా జనాలు రావడం అనేది సహజం. అది చాలా చిన్న విషయం’’ అంటూ సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేసారు..

Related posts

పరుశురాం నెక్స్ట్ హీరో అతనేనా….

filmybowl

లైగర్ కష్టం ఎక్కడకి పోలేదు….

filmybowl

సెల్ఫీ ఇచ్చి ఫోన్ తీసుకున్న రాంచరణ్..ఫన్నీ మూమెంట్.. వీడియో వైరల్..!!

murali

Leave a Comment