ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2’’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందంటే కేవలం 31 రోజుల్లోనే బాహుబలి 2 రికార్డు సైతం బద్దలు కొట్టి 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అమిర్ ఖాన్ దంగల్ సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా పుష్ప 2నిలిచింది. పుష్ప 2 నార్త్ లో ఓ రేంజ్ కలెక్షన్స్ సాధించింది..
Unstoppable : అకిరా నందన్ సినీ ఎంట్రీ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?
ఇప్పటికీ పుష్ప 2 కి నార్త్ లో క్రేజ్ బాగానే వుంది. అయితే ఈ సినిమా వచ్చి నెల రోజులు కావడం మరో మూడు రోజుల్లో సంక్రాంతి సినిమాలు రానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప క్రేజ్ తగ్గింది… రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న, బాలయ్య నటించిన డాకు మహారాజ్ జనవరి 12న, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రానున్నాయి. ఒక్కో సినిమాకు రెండు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా థియేటర్స్ ఇచ్చి కలెక్షన్స్ తెచ్చుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారు.
అయితే సంక్రాంతి సినిమాలకు సడెన్ గా పుష్ప 2 షాక్ ఇచ్చింది. పుష్ప 2 సినిమాలో మరో 20 నిముషాలు సీన్స్ జతచేసి మళ్ళీ జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో టాలీవుడ్ లో సరికొత్త రచ్చ మొదలైంది… అసలు సంక్రాంతి సినిమాలు ఉన్న సమయంలో పుష్ప 2 కి మళ్ళీ థియేటర్స్ ఎలా ఇస్తారు అని పలువురు అంటుంటే, అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు