MOVIE NEWS

పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది.గతంలో వచ్చిన పుష్ప సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పుష్ప కంటే మరింత ఇంట్రెస్టింగ్ గా సుకుమార్ తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ బీహార్ రాజధాని అయిన పాట్నా లో ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేసారు.రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.ట్రైలర్ ఆద్యంతం మాస్ ఎలిమెంట్స్ తో నింపేశారు.

అలాగే పుష్ప రాజ్ చెప్పే డైలాగ్స్ మరింత హైప్ ఎక్కించాయి.మొత్తానికి ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది.దీనితో ప్రస్తుతం పుష్ప ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు.ఎప్పుడెప్పుడా అని అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురు చూసిన పుష్ప ట్రైలర్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చి  యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది.రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే ట్రైలర్ చూసిన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇప్పటికే దర్శకులు ప్రశాంత్ వర్మతో పాటు, హారీశ్ శంకర్, రిషబ్ శెట్టి, అనిల్ రావిపూడి తదితరులు ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇప్పుడు తాజాగా దర్శక దిగ్గజం రాజామౌళి కూడా ఈ సినిమా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసారు. పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్‌ 5న చెలరేగుతోంది. పార్టీ కోసం వెయిట్ చేయలేకపోతున్నా పుష్ప అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

https://x.com/ssrajamouli/status/1858375954214650251?

 

Related posts

ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!!

murali

మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..?

murali

బుక్ మై షో లో పుష్పరాజ్ మాస్ రికార్డ్.. ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే..?

murali

Leave a Comment