MOVIE NEWS

పుష్ప 2 : భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదలైన ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు.. బీహార్ రాజధాని పాట్నా లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది.. తాజాగా చెన్నై లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసిన మేకర్స్.. సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ అయిన “కిస్సిక్” ను రిలీజ్ చేసారు.. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ మారింది..

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుండి  నవంబరు 28 దాకా  కర్ఫ్యూ అమలులో ఉంది. దీంతో హైదరాబాద్ సిటీలో ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి దొరకడం లేదు.ఈ ఆంక్షలతో సినిమా పరిశ్రమకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాలకు సంబంధించి ఎలాంటి అవుట్ డోర్ ఫంక్షన్స్ కు ఎటువంటి అనుమతులు దొరకని నేపథ్యంలో పుష్ప -2 విషయంలో నిర్మాతలకు టెన్షన్ మొదలైంది.అయితే మరో మూడు రోజుల్లో ఈ కర్ఫ్యూ గడువు ముగుస్తుంది.దీనితో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసారు.

ఈ నేపథ్యంలోహైదరాబాద్ లోని LB స్టేడియం లో చేసేందుకు వారు అనుమతులు కోరారు. కానీ ఆ సమయానికి LB స్టేడియంలో శ్రేయా ఘోషల్ కాన్సర్ట్ ఉండటంతో అక్కడ పుష్ప ఈవెంట్ చేసేందుకు అవకాశం లేదు…అయితే గచ్చిబౌలి స్టేడియంలో అయిన చేసుకునేందుకు అనుమతి కోరగా అందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. చివరికీ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేసేందుకు మైత్రీ మూవీస్ నిర్మాతలు అనుమతులు పొందారు.అనుమతులు కూడా రావడంతో పుష్ప ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించాలని మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు..

Related posts

పవన్ కోసం మళ్ళీ రంగంలోకి రమణ గోగుల..?

murali

అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్.

filmybowl

పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..?

murali

Leave a Comment