ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2′ డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది… డిసెంబర్ 4 నుంచే చాలా చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలు వేశారు. వీటి ద్వారా సినిమాకు కోట్లాది రూపాయల కలెక్షన్లు వచ్చాయి.అలాగే అడ్వాన్స్ బుకింగ్ లో సైతం పుష్ప 2 సినిమా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు కలుపుకుని ఈ సినిమా దాదాపు రూ. 294 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఓ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి.
ఖైదీ 2 : ఆ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నారా..?
పుష్ప 2 సినిమా చూసిన ప్రముఖులందరు సినిమా అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, డైరెక్టర్లు మరియు ఇతర ప్రముఖులు పుష్ప 2 ను చూశారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో సీనియర్ యాక్టర్ విలక్షణ నటుడు అయిన ప్రకాష్ రాజ్ కూడా పుష్ప 2 సినిమాను చూసి ట్విట్టర్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నాడు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ ‘గంగోత్రి నుండి నీ ప్రయాణాన్ని చూస్తున్నాను. ఒక శిల్పాన్ని చెక్కినట్లు ఉండే, నీ జర్నీ ఎంతో గొప్పది. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. నువ్వు ఎప్పుడు ఇలాగే నీ నటనతో సరిహద్దులు చెరిపేస్తూ ఉండాలి’ అని అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు. అలాగే పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా ప్రకాష్ రాజ్ అభినందనలు తెలిపాడు.ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన నిజంగా అదిరిపోతుంది.. కొన్ని సీన్స్ లో సామాన్య ప్రేక్షకుడికి సైతం గూస్ బంప్స్ వస్తాయి.. ఆ రేంజ్ లో పుష్ప 2 ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించాడు..