MOVIE NEWS

పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్ లో భాగంగా సినిమా ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బీహార్ ఈవెంట్ భారీ సక్సెస్ కావడంతో ఇండియా మొత్తం భారీ ఈవెంట్స్ మేకర్స్ ప్లాన్ చేశారు. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తగ్గేదేలే అనే ఒక్క డైలాగ్ తో అల్లు అర్జున్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. పుష్ప సినిమా ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దీంతో వారు పుష్ప 2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!!

అయితే పుష్ప సినిమాను దర్శకుడు సుకుమార్ మరింత గ్రాండ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 1000 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ భావించారు. అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ జరుపుతుందటంతో పుష్ప 2 సినిమా మళ్లీ వాయిదా పడుతుందా అనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.. తాజాగా మేకర్స్ ఈ వాయిదా వార్తపై స్పందించారు. ఈ ఊహగానాలకు తెరదించేలా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. మూవీలో అల్లు అర్జున్ మేనరిజం వీడియోను పోస్ట్ చేసి “డిసెంబర్ 5 అస్సలు తగ్గేదేలే” అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనితో అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవుతుందనే క్లారిటీ వచ్చింది.

https://x.com/PushpaMovie/status/1859807973243224363?

Related posts

పుష్ప 2 : రిలీజ్ సమయంలో నాగబాబు సంచలన ట్వీట్..!!

murali

“గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..!

murali

హామీ ఇస్తున్నా.. అస్సలు నిరాశ పరచను.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment