దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చారు.., తన క్రియేటివిటి,మార్కెటింగ్ టెక్నిక్స్‌తో తన సినిమాలకు వసూళ్ల వర్షం కురిసేలా చేసారు.పాన్ ఇండియా మార్కెట్ కి బాటలు వేసింది రాజమౌళినే.. బాహుబలి సినిమాతో బాలీవుడ్‌ను షేక్ చేసి రాజమౌళి ట్రెండ్ సెట్ చేసారు.. దర్శకుడిగా 20 ఏళ్ల కెరీర్‌లో ఒక్క ఓటమి కూడా ఏరుగని దర్శకుడిగా రాజమౌళి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..తాను సినిమాలని ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తాడో అలాగే కంటెంట్ బాగున్న సినిమాలను ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వుంటారు..కొత్త సినిమాలకు రాజమౌళి తనదైన శైలిలో రివ్యూలు ఇస్తుంటారు ..
తాజాగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2 ‘.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల క్రితం రిలీజైన పుష్ప పార్ట్ 1కి సీక్వెల్‌గా ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.సినిమా మొదలు నుండి ఆఖరి వరకు అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
వెర్షన్స్ మారుస్తున్న సుకుమార్.. హీరో పాత్రలపై భారీ ప్రయోగాలు..!!
సినిమాలో డాన్స్, సాంగ్స్, ఫైట్స్ ఇలా అన్నిటికీ సూపర్ రెస్పాన్స్ వస్తున్నాయి..ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ చేసే డ్యాన్స్, ఫైట్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్‌పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా అదిరిపోతుందని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పిన ప్రిడిక్షన్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.ఇదొక్కటే కాదు.. గతంలో రాజమౌళి ఇతర సినిమాల విషయాల్లో చేసిన వ్యాఖ్యలను సైతం నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు…
రాజమౌళి హైప్ కోసం చేసే వ్యాఖ్యలు సినిమా రిలీజ్ అయ్యాక మ్యాచ్ కావడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు… జపాన్‌లో హీరో అల్లు అర్జున్ ఇచ్చే ఇంట్రడక్షన్ సీన్ చాలా నార్మల్‌గా ఉంటుంది. ఏకంగా 40 రోజుల పాటు నీళ్లు, ఆహారం లేకుండా కంటైనర్‌లో జపాన్ వరకు వెళ్లే హీరో అక్కడ అడుగుపెట్టగానే విలన్స్ ని చితక్కొట్టడటం చాలా అతిగా ఉందంటూ మాస్ ట్రోలింగ్ చేస్తున్నారు…ఈ సీన్ కి రాజమౌళి హైప్ ఇవ్వడంతో మరింత ట్రోల్ చేస్తున్నారు..