MOVIE NEWS

పుష్ప 2 : రిలీజ్ సమయంలో నాగబాబు సంచలన ట్వీట్..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అంటే గత కొంతకాలంగా మెగా ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు.. పవన్ కల్యాణ్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ఎలక్షన్స్ కాంపెయినింగ్ చేయడమే మెగా ఫ్యాన్స్ కి బాగా కోపం తెప్పించింది.. కాంట్రవర్సి అవుతుందని తెలిసిన అల్లు అర్జున్ కావాలనే అలా చేసాడని మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై కోపం తెచ్చుకున్నారు.. కానీ అలా చేయడానికి కారణం కూడా బన్నీ పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు.. కానీ మెగా ఫ్యాన్స్ బన్నీ పై ద్వేషం పెంచుకున్నారు.. దీనికి తోడు సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం అలాగే మనవాడు కానీ వాడు మనవాడైనా పరాయి వాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనం సృష్టించింది..

ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..?

దీనితో మెగా vs అల్లు అనే కొత్త గొడవ మొదలయింది.. మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ సినిమాను బాయ్ కాట్ చేయాలనీ పిలుపునిచ్చారు.. కానీ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ పెరిగింది..దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం మెగా ఫ్యాన్స్ తో గొడవకు దిగారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్దమైంది.. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. అయితే ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలనీ మెగా ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు..

అయితే సరిగ్గా పుష్ప రిలీజ్ ముందు నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే “సినిమా” ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని నేను కోరుకుంటున్నాను.. అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో మెగా ఫ్యాన్స్ పుష్ప సినిమా విషయంలో తగ్గినట్లు తెలుస్తుంది..

Related posts

గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!!

murali

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

murali

ఎదో ఒక డేట్ చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా చైతూ

filmybowl

Leave a Comment