MOVIE NEWS

పుష్ప 2 : మ్యూజిక్ కాంట్రవర్సీ..దేవిశ్రీ కామెంట్స్ పై స్పందించిన ప్రొడ్యూసర్..!!

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది..ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించినా కూడా ఇంకా చాలామంది ప్రేక్షకులకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ మూవీ ఎడిటింగ్ ఇంకా పూర్తికాలేదని, మ్యూజిక్ సిద్ధంగా లేదనే న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా స్టేజ్‌పైనే నిర్మాతలపై దేవీ శ్రీ ప్రసాద్ సీరియస్ అయ్యారు. దానిపై తాజాగా నిర్మాత స్పందించారు.’పుష్ప’ సినిమా విడుదలయ్యి మూడేళ్లు అయ్యింది. సీక్వెల్ పై మేకర్స్ సరిగ్గా దృష్టి పెడితే అనుకున్న సమయం కంటే ముందుగానే ‘పుష్ప 2’ సినిమా థియేటర్స్ లోకి వచ్చేదని, కానీ మేకర్స్ నిర్లక్ష్యం మూలాన ఇంకా పనులు పూర్తికాలేదని చాలామంది ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మ్యూజిక్ విషయంలో దేవీ శ్రీ ప్రసాద్‌పై బాగా ప్రెజర్ పడినట్టుంది. అందుకే తాజాగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలపై ఆయన సీరియస్ అయ్యారు.తనపై నిర్మాతలకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయని అన్నారు .

ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..?

తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్.. దేవీ శ్రీ ప్రసాద్ కామెంట్స్‌పై స్పందించారు. ”దేవీగారు ..మావాళ్లకు నా మీద చాలా లవ్ ఉంటుంది. దాంతో పాటు ఈ మధ్య నాపై కంప్లైంట్స్ కూడా ఎక్కువయ్యాయని అన్నారు. అందులో తప్పేముంది..? మాకైతే అందులో తప్పేమీ కనిపించలేదు. తర్వాత మీరు ఇచ్చిన ఆర్టికల్స్ చూసి దాన్ని అంతా తప్పు అనుకున్నారు. సినిమా టీం అంతా ఒక ఫ్యామిలీ. ఆయన మాతో సినిమాలు చేస్తారు.మా ప్రొడక్షన్ ఉన్నంతవరకు ఆయనతో మేము సినిమాలు చేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు

Related posts

చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా

filmybowl

మెగా సీజన్ స్టార్ట్స్

filmybowl

పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

murali

Leave a Comment