MOVIE NEWS

పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి… డాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసిన కిస్సింగ్ సాంగ్ అయితే దుమ్ములేపింది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీలీల, అల్లు అర్జున్ ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడి స్టెప్పులేశారో ఇందులో చూపించారు.

పెద్ది :చరణ్ మూవీ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్ తో చర్చలు..?

ముఖ్యంగా శ్రీలీల ఈ పాట కోసం చేసిన రిహార్సల్స్ ను కూడా చూపించారు. గ్లామర్ తో పాటు డ్యాన్స్ తో కూడా శ్రీ లీల ఇరగదీసింది.కిస్సిక్ పాటకు సూపర్ క్రేజ్ లభించింది..ఈ పాట వచ్చిన మొదట్లో పుష్ప ఫస్ట్ పార్టులోని ఊ అంటావా మావ సాంగ్ లో సమంత డాన్స్ తో శ్రీలీలను పోల్చి ట్రోల్స్ చేశారు. సమంత ముందు శ్రీలీల తేలిపోయిందంటూ పోస్టులు కూడా పెట్టారు. కానీ శ్రీలీల తన అందం, డ్యాన్స్ తో కుర్రకారును ఊపేసింది.

ఈ మేకింగ్ వీడియో విడుదలైన కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అవుతోంది. ఈ సాంగ్ తర్వాత శ్రీలీల కు హీరోయిన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి..ప్రస్తుతం అల్లు అర్జున్ యంగ్ డైరెక్టర్ అట్లీతో భారీ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ తో కూడా అల్లు అర్జున్ భారీ సినిమా చేయాల్సి వుంది..

Related posts

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..త్వరలో బిగ్ అప్డేట్..!!

murali

ఎన్టీఆర్ “డ్రాగన్” పై ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!!

murali

బాలయ్య “డాకు మహారాజ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

murali

Leave a Comment