MOVIE NEWS

పుష్ప 2 : జాతర ఎపిసోడ్ అంతా ఇంటి పేరు కోసమేనా..?

రేపు దేశమంతా పుష్ప 2 జాతర మొదలు కానుంది.. మూడేళ్ళ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఓ బిగ్గెస్ట్ మూవీ వస్తుందటం తో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు.. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా వున్నారు.. నేడు అర్ధరాత్రి నుంచి పుష్ప 2 ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీనితో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హడావుడి సృష్టిస్తున్నారు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు…ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చాయి..

ఫ్యాన్స్ తో కలిసి “పుష్ప 2” చూడబోతున్న ఐకాన్ స్టార్..!!

అయితే పుష్ప 2 లో గంగమ్మ జాతర సన్నివేశం మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.. ఈ జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ అన్నయ్య అజయ్ కుటుంబం కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది.సినిమాలో జాతర ఎపిసోడ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుంచి హాట్ టాపిక్ గా మారింది.. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ పై టీమ్ అంతా పూర్తి దృష్టి పెట్టిందని సమాచారం. అల్లు అర్జున్ కెరీర్ లోనే జాతర ఎపిసోడ్ బెస్ట్ ఎపిసోడ్ గా నిలువనుందని సమాచారం.

పుష్ప రాజ్ అన్నయ్య అజయ్ ఫ్యామిలీ జాతర ఎపిసోడ్ లో క్రూసియల్ పార్ట్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తుంది.. అజయ్ ఫ్యామిలీ కోసమే పుష్ప రాజ్ ఈ ఫైట్ చేస్తాడు. పార్ట్ 1 లో పుష్ప రాజ్ సవతి తమ్ముడు అవటంతో అజయ్ ఫ్యామిలీ అసలు పట్టించుకోడు. పుష్ప ..సిండికేట్ లీడర్ అయినా కూడా అతన్ని తమ ఫ్యామిలీలోకి రానివ్వరు. ఇంటి పేరు ఇవ్వరు.దాంతో సెకండ్ పార్ట్ లో కుటుంబం కోసం తన సిండికేట్ ని సైతం ఎదిరించటం, తన అన్న కుటుంబాన్ని సేవ్ చేయటంతో పుష్ప ఇంటిపేరు సంపాదిస్తాడు..

Related posts

తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!!

murali

గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..?

murali

పుష్ప2 టైటిల్ సాంగ్ రిలీజ్.. డిలీటెడ్ సీన్స్ అదిరిపోయాయిగా.!!

murali

Leave a Comment