MOVIE NEWS

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..  రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.. దీనితో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారిగా కలెక్షన్స్ సాధిస్తుంది.పుష్ప 2 సినిమా బాక్సాఫీస్‌ దగ్గర చరిత్ర తిరగ రాస్తుంది. ఫస్ట్ డే ఈ సినిమా రూ. 294 కోట్లు సాధించి ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసింది. కేవలం ఆరు రోజుల్లో ఈ సినిమా వెయ్యి కోట్లు సాధించింది..

సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!!

ఈ సినిమా ఏకంగా రెండు వారాల్లో రూ.1500 కోట్లు రాబట్టి అత్యధిక వేగంగా  వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది… తాజాగా పుష్ప 2 సినిమాకు సంధ్య థియేటర్ వివాదం మరింత పబ్లిసిటీ తీసుకొచ్చింది.. గత కొన్నాళ్ళుగా జనాలంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..దీనితో ఈ సినిమా 21 రోజుల్లో రూ. 1705 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది..

తాజాగా మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. ఇదే క్రేజ్ తో పుష్ప 2 సినిమా మరో రూ. 100 కోట్లు రాబడితే చాలు బాహుబలి 2 రికార్డ్ కు కాలం చెల్లినట్లే… ఇప్పటివరకు బాహుబలి -2 క్రియేట్ చేసిన రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఏ సినిమా రాలేదు… కానీ పుష్ప2 మాత్రం ఏకంగా బాహుబలి రికార్డ్‌ నే క్రాస్ చేసేలా వుంది.. బాహుబలి 2 మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ రూ. 1800 కోట్లతో ఇండియన్ టాప్ గ్రాసర్ మూవీస్‌లో రెండో స్థానంలో ఉంది. కానీ పుష్ప 2 కేవలం 21 రోజుల్లోనే రూ. 1705 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది..

Related posts

గేమ్ ఛేంజర్ : బిగ్గెస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్..?

murali

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

దేవర ని హైలెట్ చేయనున్న సీన్స్ ఏంటి ?

filmybowl

Leave a Comment