MOVIE NEWS

పుష్ప 2 : ట్రైలర్ లో ఈ సీన్స్ గమనించారా..సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా ..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేసారు.బీహార్ రాజధాని పాట్నాలో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేయగా అల్లు అర్జున్,రష్మిక మందన్న హాజరు అయ్యారు.తాజాగా లాంచ్ చేసిన ట్రైలర్ కు నెటిజన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ..పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది..ట్రైలర్ లో  ఇలాంటి డైలాగ్స్ చాలానే వున్నాయి.అల్లు అర్జున్ ని దర్శకుడు సుకుమార్ ఈ సారి మరింత పవర్ఫుల్ గా చూపించాడు.పార్ట్ 2 లో సుకుమార్ కొన్ని కొత్త పాత్రలను ఇంట్రోడ్యూస్ చేసాడు..ట్రైలర్ ని బాగా గమనిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..?

జాతర ఎపిసోడ్ లో ఒక వ్యక్తి చీర కట్టుకొని అరగుండు గెటప్ లో నడుస్తూ కనిపిస్తాడు. అలాగే అతని మెడలో చెప్పుల మాల కూడా ఉంటుంది. ఇందులో అరగుండులో కనిపించిన నటుడు ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది నెటిజన్స్ ఆ పాత్ర చేసింది ఫహద్ ఫాజిల్ అనుకున్నారు. కానీ ఆ పాత్రలో కనిపించిన వ్యక్తి ఎవరో కాదు  పుష్ప పార్ట్ 1 లో రసిక రాజా గా పేరు తెచ్చుకున్న జాలి రెడ్డి.. ఈ పాత్రని కన్నడ యంగ్ హీరో డాలీ ధనంజయ చేసాడు.

పార్ట్ 1 లో శ్రీవల్లి తో అసభ్యంగా ప్రవర్తించినందుకు జాలి రెడ్డి ఎముకలు విరగ్గొడతాడు పుష్ప. దానితో పుష్ప పై పగ పెంచుకున్న జాలి రెడ్డి మళ్లీ తాను పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత పుష్ప ని దొంగ దెబ్బ తీసేందుకు జాతర లో ఇలాంటి వేషం వేసుకొని వచ్చినట్టుగా నెటిజన్స్ ఊహించారు.అలాగే ట్రైలర్ మధ్యలో ఎర్ర చందనం కట్టెలతో శవాన్ని పేర్చి కాల్చే సీన్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో శ్రీవల్లి చనిపోతుంది అని ఆ శవం ఆమెదే అనే విషయం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.ఇలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయని తెలుస్తుంది.దర్శకుడు సుకుమార్ ఈసారి గట్టిగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

Related posts

పుష్ప 2 : ఐకాన్ స్టార్ సినిమాకి ఆ మెగా హీరో బెస్ట్ విషెస్..

murali

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ పై బిగ్ అప్డేట్ వైరల్..!!

murali

గేమ్ ఛేంజర్ : భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. స్పెషల్ గెస్టులుగా ఆ స్టార్ డైరెక్టర్స్..!!

murali

Leave a Comment