MOVIE NEWS

“పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఐకాన్ స్టార్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రభాస్ బాహుబలి 2 రేర్ రికార్డును క్రాస్ చేసింది.. ఇండియన్ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది..

సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న తలైవా “కూలీ”.. కారణం అదేనా..?

ప్రస్తుతం ఈ చిత్రం టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా వుంటే తాజాగా ఈ సినిమా ఇప్పటివరకు సాధించిన ఫైనల్ కలెక్షన్స్‌ని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా రూ. 1,871 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

మొదటి రోజే రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 3 రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.వారం రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్లు కలెక్షన్లు సాధించి అదరగొట్టింది. త్వరలోనే మేకర్స్ పుష్ప 3 ని కూడా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే పుష్ప 3 సెట్స్ పైకి రావడానికి బాగా టైం పట్టే అవకాశం వుంది..

Related posts

ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

murali

మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..?

murali

Leave a Comment