MOVIE NEWS

పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మేకర్స్ గ్రాండ్ గా మొదలు పెట్టారు..ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘పుష్పగాడి’ రూలింగ్.. వచ్చే వారమే మొదలు కానుంది. కానీ ఇంకా పుష్ప 2 షూటింగ్ మాత్రం ఇంకా జరుగుతునే ఉంది. దీనితో పుష్ప 2 సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అని టెన్షన్ పడుతున్నారు..షూటింగ్ అంతా రిలీజ్ సమయానికి ఫినిష్ అవుతుందా అని వారు ఆందోళన చెందుతున్నారు.

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

అయితే తాజాగా రెండు రోజుల క్రితం ఓ మాస్ సాంగ్‌తో షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయిందని ఇక ఇప్పుడు ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని సమాచారం.. అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ చిన్న ప్యాచ్ వర్క్‌ షూట్‌తో పుష్ప 2 సినిమాకి మేకర్స్ గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు..షూటింగ్ అంతా పూర్తైంది కాబట్టి డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవడం పక్కా అని వారు భావిస్తున్నారు..

ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ తో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ మొత్తం సిద్ధం కాగా సెకండాఫ్ వర్క్ కూడా మరో రెండు రోజుల్లో పూర్తి కానుందని సమాచారం.. ఆ తరువాత సెన్సార్‌ కార్యక్రమాలు సుకుమార్ ప్లాన్ చేశాడు. సుక్కు తన పనిలో బిజీగా ఉండగా మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నై ఈవెంట్స్‌తో పుష్ప కి మంచి హైప్ క్రియేట్ అయింది…త్వరలో మరిన్ని భారీ ఈవెంట్స్ జరగనున్నట్లు తెలుస్తుంది.. హైదరాబాద్‌లో అదిరిపోయే ఈవెంట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం

Related posts

వెంకీ మామ గోయింగ్ బ్యాక్….

filmybowl

ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో 3rd ఫిలిం రాబోతుంది….

filmybowl

బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..!

filmybowl

Leave a Comment