MOVIE NEWS

పుష్ప 2 ఎక్సట్రా ఫుటేజ్ ప్రోమో అదిరిందిగా..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి.. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 294 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా లో అల్లుఅర్జున్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయ్యారు.గతంలో వచ్చిన పుష్ప సినిమాకి పుష్ప 2 సీక్వెల్ గా తెరకెక్కింది..పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ నటనకు గాను నేషనల్ అవార్డ్ లభించింది.. దీనితో పుష్ప 2 సినిమాకు భారీగా హైప్ క్రియేట్ అయింది..

ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!!

ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీగా రెస్పాన్స్ వచ్చింది.. నార్త్ లో ఈ సినిమాకు మాములు క్రేజ్ లేదు.. అక్కడ ఈ సినిమా ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. ఈ సినిమా ఓవరాల్ గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాహుబలి 2 సినిమా రికార్డు బ్రేక్ చేసింది.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో 20 నిమిషాలు ఫుటేజ్ యాడ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు..పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 కి అద్భుతమైన లీడింగ్ ఇచ్చారు.

అయితే నిడివి ఎక్కువ కారణం గా ఈ సినిమాలో కొన్ని సీన్స్ మేకర్స్ తొలగించారు.. తాజాగా ఆ సీన్స్ ని మేకర్స్ యాడ్ చేస్తున్నారు.. తాజాగా 20 మినిట్స్ ఫుటేజ్ కి సంబంధించి మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.. ఈ గ్లింప్స్ మరింత ఆసక్తి రేకెత్తించింది.. మేకర్స్ ఈ 20 నిమిషాల ఫుటేజ్ ని జనవరి 17 న థియేటర్స్ లో విడుదల చేయనున్నారు..

Related posts

సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ #27 గా అశోక్ గల్లా చిత్రం ప్రారంభం

filmybowl

ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..?

murali

మహేష్ సినిమా కోసం రంగంలోకి మరో స్టార్ ప్రొడ్యూసర్.. జక్కన్న ప్లానింగ్ అదిరిందిగా..!!

murali

Leave a Comment