MOVIE NEWS

పుష్ప 2 : వాయిదా పై క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ లో అదే భయం..అదే కన్ఫ్యూజన్..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2’’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా పుష్ప.. దీంతో పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అల్లు అర్జున్ గత మూడు ఏళ్ల నుంచి పుష్పా 2 సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించాడు.. గత మూడేళ్లుగా అల్లు అర్జున్ ని స్క్రీన్ పై చూడలేదు. దీనితో ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది. రిలీజ్ డేట్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది.

ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో విడుదల తేదీ వాయిదా పడింది. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తామని అప్పట్లో మేకర్స్ ప్రకటించారు.. కొంతకాలానికి డిసెంబర్ 6న కాదు డిసెంబర్ 5నే ఈ సినిమా వస్తుందని మేకర్స్ మళ్లీ ప్రకటించారు.. చెప్పిన దానికంటే ఒక రోజు ముందుగా వస్తుందని ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు.. కానీ ఆ తేదీన కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పాట్నాలో విడుదల చేయగా దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. కచ్చితంగా డిసెంబరు 5న సినిమా రాబోతోందని అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు.

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..?

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ సీన్స్ దర్శకుడు సుకుమార్ ఇంకా షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవిశ్రీప్రసాద్ తో పాటు తమన్ ను అలాగే మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా తమన్ అందించిన బీజీఎం సుకుమార్ కు అంతగా నచ్చలేదు. దీంతో దగ్గరుండి మరీ తనకు కావల్సిన రీతిలో మరోసారి బీజీఎంను రాబట్టుకుంటున్నట్లు సమాచారం.. పుష్ప2 మొదటి భాగం వరకు మాత్రమే బీజీఎం, రీరికార్డింగ్ పని పూర్తవగా దీన్ని ఐమాక్స్ ఫార్మాట్ లోకి మార్చడానికి పంపించినట్లు తెలుస్తుంది..ఇంకా రెండో భాగానికి సంబంధించిన బీజీఎం, రీరికార్డింగ్ పని అలానే ఉంది. అంతేకాకుండా వీఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఆ విభాగం నుంచి పూర్తయిన సన్నివేశాలు ఇంకా రాలేదు. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 13 రోజులే మిగిలి వుంది.. ఈ 13 రోజుల్లో మిగిలిన షూటింగ్ భాగము  పనులన్నీ పూర్తి అవుతాయా అనేది సందేహంగా మారింది..

తమన్ ఇచ్చే మ్యూజిక్ సుకుమార్ కి నచ్చాలి ఆ మ్యూజిక్ ని ఆయన ఫైనల్ చేయాలి ఇదంతా కావడానికి కనీసం వారం రోజులైనా సమయం పడుతుంది అని సమాచారం.. దీంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడనుందని తెలుస్తుంది.. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 19 కి ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. హడావుడిగా రిలీజ్ చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తున్న నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది . వాయిదా వార్తలపై రీసెంట్ గా స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించింది. పుష్ప 2 పై వస్తున్న వరుస కథనాలతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.. మేకర్స్ ఈ విషయంపై వెంటనే స్పందించాలని కామెంట్స్ చేస్తున్నారు..

Related posts

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?

murali

డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!!

murali

గేమ్ ఛేంజర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. టికెట్స్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

Leave a Comment